భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టిన తరవాత పాతికేళ్ళు తల్లి తండ్రులు చూస్కుంటే ఆ తరవాత జీవితం మొత్తం భర్త భార్యకు తోడుగా ఉండాలి. భార్య భర్తకు తోడు ఉంటుంది. అలాంటి బంధం లో దాదాపు ఎలాంటి రహస్యాలు ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ ఆచార్య చాణక్యుడు మాత్రం భార్య భర్తకు చెప్పకుండా నాలుగు రహస్యాలను తనలోనే దాచుకుంటుంది అని చెప్పాడు. అది కూడా మంచిదే అని చాణక్య నీతి లో పేర్కొన్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బును ఆదా చేయడం
భార్యలు భర్తకు తెలియకుండా డబ్బులను జమ చేస్తారట. భర్త కర్చులకు ఇచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం ద్వారా మిగిలిన దాన్ని దాచిపెడతారట. అయితే ఆ డబ్బును కుటుంబంలో అవసరం వచ్చిన వెంటనే మళ్ళీ బయటకు తీస్తారట.
Advertisement
Advertisement
శృంగార రహస్యం.
భార్య భర్తలు కలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి భర్త అడిగినా భార్యకు పెద్దగా స్పందించరట. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరట. తమ సంతృప్తి…కోరికల గురించి భార్యలు అస్సలు చెప్పరని చాణక్యుడు చాణక్య నీతి లో పేర్కొన్నాడు.
జబ్బుల విషయాన్ని దాయడం.
భార్యలు తమకు జ్వరం, చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా పట్టించుకోరట. డబ్బులను ఎందుకు ఖర్చు చేయడం అని అలాగే ఉండి పోతారట. అయితే అలా చేయడం వల్ల స్త్రీలు నష్టపోతున్నారు అని చాణక్యుడు తెలిపాడు.
ఏకపక్ష ప్రేమ
భార్యకు దేన్నైనా ఇష్టపడితే ఏకపక్షంగా ప్రేమిస్తారట. ఎంత ప్రేమించినా ఆ విషయాన్ని భర్తకు తెలీకుండా ఉంచుతారట. రహస్యం గానే ప్రేమించి ఆ రాస్తానని జీవితాంతం తమతోనే రహస్యం గా ఉంచుకుంటారట.