ప్రస్తుత కాలంలో వివాహానికి ప్రాధాన్యత అనేది కొరవడింది.. పెళ్లంటే నూరేళ్ల పంట అనే సామెత నుండి పెళ్లంటే నూరేళ్ళ మంట అని స్టేజ్ కి వచ్చారు.. పూర్వకాలంలో దంపతులు ఇద్దరు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో పిల్లాపాపలతో జీవించేవారు. అలాంటి పరిస్థితులు మారాయి.. మగవారితో సమానంగా ఏ పనిలో అయినా పోటీ పడుతున్నారు స్త్రీలు..
కాబట్టి పెళ్లి విషయంలో కూడా సమానమైన హక్కులను, జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇంత డెవలప్మెంట్ మంచిదే కానీ, ఇది జీవితాన్ని నాశనం చేసేది అయితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.. ఇది విడాకులకు దారితీస్తుంది.. కాబట్టి ఆలుమగల మధ్య అనుబంధం ఉండాలంటే ఈ మూడు సూత్రాలు పాటిస్తే సుఖమంతమైన జీవనం ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు..
Advertisement
also read:Shriya:అంతటి బాధలో కూడా సినిమా పూర్తి చేసిన జక్కన్న..ఆ పట్టుదలకు హ్యాట్సాఫ్..!!
Advertisement
#1. కష్టసుఖాలు పంచుకోవాలి:
భార్యాభర్తల అన్నాక ఒకరి కష్టం మరొకరికి చెప్పుకుంటూ ఆ కష్టాల నుంచి గట్టెక్కించే ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి తప్ప, నా కష్టం నీకు చెప్తే నువ్వేం తీరుస్తావా అనే అహంతో భర్త ఉంటే జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
#2: కుటుంబం కోసం సమయం :
కొంతమంది ఉద్యోగరీత్యా డబ్బు వేటలో పడి కనీసం కుటుంబానికి కూడా సమయం ఇవ్వరు. అమూల్యమైన సమయాన్ని భార్యకు కేటాయించకుండా ఉండటంవల్ల బంధంలో కాస్త కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువైతే విడాకులకు దారితీస్తుంది. కాబట్టి సమయం దొరికితే భార్యతో కాస్త ఏకాంతంగా గడపండి.
#3. మనసు విప్పి మాట్లాడడం:
కొంతమంది భర్తలు భార్యను కేవలం ఇంట్లో పని చేసే బొమ్మలాగే చూస్తారు. కనీసం వారితో మనసు విప్పి మాట్లాడే సమయం కూడా ఇవ్వరు. వారి ఇష్టాలను తెలుసుకోకుండా వన్ సైడ్ గా మాట్లాడుతూ వారిని కించపరుస్తూ ఉంటారు. దీనివల్ల మీ బంధంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మీ జీవిత భాగస్వామితో మీకు సమయం దొరికినప్పుడల్లా మనసు విప్పి మాట్లాడండి.
also read: