పెళ్లిరోజున భార్యభర్తలు జీవితాంతం కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకుంటారు. ఎంతటి కష్టం వచ్చినా తమ జీవిత భాగస్వామిని విడవకూడని ప్రమాణం చేసుకుంటారు. అంతే కాకుండా కష్టంలోనూ సుఖంలోనూ తోడుగా ఉండాలని అనుకుంటారు. కానీ పెళ్లి తరవాత అందరి జీవితాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది. దాంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి.
Advertisement
అయితే చిన్న చిన్న గొడవల వరకూ పర్వాలేదు కానీ ఆ గొడవలు పెద్దవి అయితే మాత్రం నష్టం తప్పదు. కాబట్టి ఆ గొడవలు పెద్దవి కావడానికి కారణాలు మరియు గొడవలు పెరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను మానసిక నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడు పరిష్కరించుకోవాలని అలా కాకుండా కోపం చిరాకు లాంటివి ప్రదర్శిస్తే బంధం వీక్ అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలలో బిజీగా ఉండటం వల్ల సమయం దొరకకపోవడంతో సంతోషంగా సమయాన్ని కూడా గడపలేకపోతున్నారు. కాబట్టి భాగస్వామి కోసం ఎంతబిజీగా ఉన్నా కూడా సమయాన్ని కేటాయించి వారితో మనసువిప్పి మాట్లాడాలని వారిని బయటకు తీసుకుని వెళ్లాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఒకరిలో మరొకరికి నచ్చని విషయాలను చెప్పడం వల్ల కూడా మనస్పర్దలు తలెత్తే అవకాశం ఉందని కాబట్టి తమ భాగస్వామిలో నచ్చని విషయం ఏదైనా ఉన్నా సర్దుకు పోవాలని చెబుతున్నారు.
ALSO READ :శాకుంతలం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్ విన్నారా..?