ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్నో ఆశలతో కోరికలతో చేసుకుంటారు. తమ జీవిత భాగస్వామితో అలా ఉండాలి ఇలా ఉండాలని కలలు కంటారు. కానీ కొన్నిసార్లు పెళ్లి తర్వాత జీవితం చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. దాంతో గొడవలు జరగడం లాంటివి జరగవచ్చు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్ల శబ్దం వస్తుంది… అదేవిధంగా వైవాహిక జీవితంలో ఇద్దరు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటేనే ఆ కాపురం నిలబడుతుంది.
Also Read: ఆర్తి అగర్వాల్ చేసిన తప్పే ఉప్పెన బూటీ కూడా చేస్తోందా…? ఇంతకీ ఆ తప్పేంటి..!
Advertisement
కొన్ని సార్లు చిన్న గొడవలు కూడా చివరికి పెద్దగా మారుతాయి. ఆ తరవాత జీవిత బాగస్వామి తో ఫ్యూచర్ సైతం కనిపించదు. దాంతో కలిసి ఉండాలా…? విడిపోవాలా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే అలాంటి సందర్భంలో ఏం చేయాలి. ఎలా ఆ సమస్య నుండి బయట పడాలి అన్నదానికి తాజాగా ఓ ప్రముఖ సైకియాట్రిస్ట్ పరిష్కారం చెప్పారు.
Also Read: లైగర్ సినిమా శాటిలైట్ కి ధర ఎంత పలికిందో తెలుసా..?
Advertisement
అదేంటో ఇప్పుడు చూద్దాం….కొన్ని జంటల్లో ఇలా జరిగినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కానీ కొన్ని జంటల్లో మాత్రం ఏం చేసినా కూడా సమస్య ను పరిష్కరించలేమని అలాంటప్పుడు విడిపోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఏ రిలేషన్ షిప్ లో అయినా ఒక్క రోజు జరిగిన గొడవలకు విడిపొరని…ఆ సందర్భంలో కోపం లో విడిపోవాలని అనిపించినా కొద్దిసేపు మాత్రమే ఆ కోపం ఉంటుందని చెప్పారు.
కానీ చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది గొడవలు పెట్టుకుంటారని అలాంటి వాళ్ళను కలిపినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పారు. ఆ సమయంలో కలిసిపోయినా మళ్లీ వాళ్ళు విడిపోతారు అని చెప్పారు. భర్తలకు నిలకడ లేని మనస్తత్వం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇలాంటివి జరగవచ్చని చెపుతున్నారు.