Ad
చెస్ లో అతి తక్కువ స్థాయి కలిగిన పౌన్ సిపాయి (బంటు)….ఇది కేవలం ఒక అడుగు ముందుకు మాత్రమే వేయగలదు. వెనక్కి రావడానికి దానికి అవకాశం లేదు. అలాంటి సిపాయి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ….. చెస్ లో తనకంటే 9 రెట్లు అధికమైన పవర్ కల్గిన మంత్రితో పాటు మరిన్ని పవర్స్ నుండి తప్పించుకుంటూ అవతలి వైపుకు వెళ్లడం అంటే మామూలు మాటలు కాదు…అందుకే ఇంతటి ఉద్యమాన్ని చేసిన సిపాయికి బహుమతిగా దాని స్థానంలో ఒక పవర్ ను అధనంగా ఇస్తారు.
Advertisement
Advertisement
దానికి మరో కారణం…సిపాయి చివరి స్థానానికి చేరుకున్నాక ఇక దానికి దారి ఉండదు… ఎందుకంటే వెనక్కి వచ్చే వెసులుబాటు దానికి లేదు కాబట్టి! దానికి తోడు యుద్ద రంగంలో సిపాయిలు కూడా అప్పుడప్పుడు పదోన్నతి పొంది మంత్రులైనట్టు చెస్ ఆటలోని బంటులకు కూడా ఇలాంటి ఆప్షన్ ను ఇచ్చారు.