సాధారణం గా ఎవరూ తుమ్మినా.. ఆటోమెటిక్ గా కళ్లు మూసుకుంటాం. ఇలా ఎందుకు చేస్తామో.. అనే డౌట్ చాలా మందికి వస్తుంది. దీని పై చాలా మంది అనేక రకాలు గా పుకార్లు వస్తుంటాయి. అందు లో ఎంత వరకు నిజం ఉంది.. లేదా అవాస్తం ఉందో ఇప్పేడు మనం తెలుసుకుందాం. అయితే మనం తుమ్మిన సమయం లో కళ్లు మూసకోక పోతే మన కంటి గుడ్డు బయట కు వస్తాయనే ఒక పుకారు ఉంది. ఈ పుకారు.. పుకారే అని చెప్పాలి. దీని లో ఎలాంటి నిజం లేదు.
Advertisement
అలాగే దీని పై మరో పుకారు కూడా ఉంది. తుమ్మినప్పుడు ఒక్క క్షణం గుండె ఆగిపోతుందని అంటుంటారు. ఇది కూడా అవాస్తవమే. అయితే మనం ఎందుకు తుమ్మిన సమయం లో కళ్లు మూసుకుంటామంటే.. మనం సాధారణం గా ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం. ఈ క్రమం లో ముక్కు ద్వారా కేవలం గాలి మాత్రమే వెళ్తుంది. గాలి తో పాటు క్రిములను, బ్యాక్టీరియా లను ముక్కు అడ్డుకుటుంది. అంటే ముక్కు అనే ది గాలి వడ పోయడానికి ఒక సాధనం గా ఉపయోగపడుతుంది. అయితే ముక్కు ఎంత సమర్థవంతం గా పని చేసినా.. ఒక్కొ సందర్భం లో క్రిములు, బ్యాక్టీరియా శరీరం లోకి వెళ్తాయి.
Advertisement
అలాంటి సందర్భం లో మెదడుకు క్రిములు, బ్యాక్టిరియాలు వచ్చాయనే వార్త అందుతుంది. ఆ సమయం లో ఊపిరితిత్తుల నుంచి గాలి 120 కిలోమీటర్ల వేగంతో ముక్కు ద్వారా బయటకు వస్తుంది. ఇలా ముక్కు నుంచి గాలి వేగం గా రావడం తో అసంకల్పితం గా కళ్లు మూసుకుంటాయి. అలాగే దీని పై శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం కూడా ఉంది. ఎవరైనా తుమ్మిన సమయం లో అప్పుడు వచ్చే సమయం లో మలినాలు కళ్ల లోకి వెళ్లకుండా అడ్డకోవడానికి అసంకల్పితం గా కళ్లు మూసుకుంటాయి.