ప్రతి యేడాది డిసెంబర్ 23న మనదేశంలో రైతు దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజులు రైతుల కృషిని గుర్తు చేసుకుంటారు. అయితే డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. దేశ ఐదవ ప్రధాని అనుభజ్ఞుడైన రైతు చౌదరి చరణ్ సింగ్ పుట్టిన రోజు సంధర్బంగానే ఈ రోజును రైతు దినోవ్సత్సవాన్ని జరుపుకుంటున్నాం. చౌదరి చరణ్ సింగ్ రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయరంగం అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతిక విధానంను అవలంభించేలా చేశారు.
మనదేశంలోనే ఆయన ప్రముఖ రైతు నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. దాంతో రైతుల ప్రయోజనాల కోసం ఎంతో కృషి చేసిన చౌదరి చరణ్ సింగ్ పుట్టిన తేదీ డిసెంబర్ 23-1902 ను 2001లో భారత ప్రభుత్వం కిసాన్ దివాస్ గా ప్రకటించింది. చౌదరి చరణ్ సింగ్ దేశంలో బ్రిటీష్ వారి చేతుల్లో ఉన్నసమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేఖంగా పోరాటాలు చేసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత రైతుల ప్రయోజనాల కోసం కృషి చేశారు. చరణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణల అమలులో ప్రధాన భూమిక పోశించారు. అంతే కాకుండా చరణ్ సింగ్ దేశ వ్యవసాయశాఖ మంత్రిగా ఉంటూ జమిందారీ వ్యవస్థను అంతం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ రైతులు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. పంటలు పండించే రైతు పరిస్థితి అలాగే ఉంటే రైతు శ్రమను దళారులు దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మనదేశంలో సగానికి పైగా జనాభా వ్యవసాయాన్ని దాని అనుబంధ రంగాలనే జీవినాధారం చేసుకుని బ్రతుకుతుండగా ఇంకా పేదరికం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. కాబట్టి రాబోయే కాలంలో అయినా రైతుల కోసం ఆలోచించే చరణ్ సింగ్ లాంటి నాయకుడు మళ్లీ రావాలని రైతులు కోరుకుంటున్నారు.