డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు పుట్టినరోజును అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా మోహన్ బాబు పుట్టిన రోజును కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా గుడిలో పూజలు చేశారు. ముఖ్యంగా మనోజ్ దంపతులు మోహన్ బాబు పుట్టినరోజును దగగ్గరుండి జరిపించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇక మంచు లక్ష్మి కూడా తన తండ్రి పుట్టిన రోజును దగ్గరుండి జరిపించారు. ఇక పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు బయటకు రాగా ఆ ఫోటోలలో మంచు లక్ష్మి, మనోజ్ మౌనిక మరియు మోహన్ బాబు సతీమణి కనిపిస్తున్నారు. అయితే ఈ పుట్టినరోజు వేడులో మంచు విష్ణు మాత్రం కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మంచు మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Advertisement
దాంతో మంచు విష్ణుకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఈ నేపథ్యంలోనే కుటుంబంలో గొడవలు జరిగాయని గుసగుసలు వినిపించాయి. విష్ణు పెళ్లికి అతిధిలా వచ్చి వెళ్లడం పై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇక ఇప్పుడు విష్ణు పుట్టినరోజు వేడుకల్లో కూడా కనిపించకపోవడంతో విష్ణు ఇంకా కోపంతోనే ఉన్నాడని నెటిజన్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు నేడు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ALSO READ : TSPSC PAPER LEAKAGE : అసలు రేణుక ఎవరు..? పేపర్ లీకేజీలో ఆమె పాత్ర ఏంటి..?