ఉదయ్ కిరణ్… తన పేరులాగే టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి అతి తక్కువ కాలంలోనే రాలిపోయిన ఒక కిరణం. ఆ కిరణం రాలిపోవడం వెనక ఎన్నో కారణాలు మరెన్నో ఒత్తిళ్లు ఉన్నాయన్నది అప్పటి మీడియాలో వచ్చిన వార్తలు. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత నువ్వు నేను తో ఉదయ్ కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరవాత ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు.
Advertisement
Also Read: ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే..!
వరుస ఆఫర్ లు అందుకున్నాడు. బడా దర్శకులు ఉదయ్ కిరణ్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు. ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకుని ఉదయ్ కిరణ్ వరుస సినిమాలు చేశాడు. అయితే అలాంటి సమయంలోనే ఉదయ్ కిరణ్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కెరీర్ డౌన్ ఫాల్ అయ్యిందని అప్పట్లో వార్తలు వినిపించేవి. ఉదయ్ కిరణ్ కు మెగాస్టార్ చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ జరగటం ఆ తరవాత పెళ్లిక్యాన్సిల్ అవ్వడం కూడా ఉదయ్ కిరణ్ కెరీర్ పై ప్రభావం చూపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Advertisement
అంతే కాకుండా ఆ తరవాతే ఉదయ్ కిరణ్ కు వచ్చిన కొన్ని ఆఫర్ లు కూడా వెనక్కి వెళ్లాయని ప్రచారం ఉంది. ఇక అదే టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎం రత్నం ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కింది. దానిపై అప్పట్లో మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే….అప్పటికే ఎఎం రత్నం ఉదయ్ కిరణ్ సినిమా 80శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ అనుకోకుండా మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది.
సినిమా ఆగిపోయిన తరవాత ఏడాది కాలానికి నిర్మాత ఎఎం రత్నం హైదరాబాద్ లో అడుగుపెట్టలేదు. ఇక ఆయన కొంత కాలం తరవాత ఓ ఫంక్షన్ కు వెళ్లగా అక్కడ ఉదయ్ కిరణ్ తో సినిమా ఏమైందని పిచ్చాపాటిగా అడిగారట. దాంతో ఎఎం రత్నం మెగాకంపౌండ్ నుండి వచ్చిన ఒత్తిడి వల్లే ఆ సినిమా ఆపేయాల్సివచ్చిందని చెప్పారట. అయితే ఈ విషయాన్ని అప్పట్లో మీడియా పెద్దగా ఎక్స్ పోజ్ చేయలేదట.
Also read: ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి బ్రేకప్ వరకూ అసలేం జరిగింది..!