జర్నీ అంటే ముందు గుర్తొచ్చేది ట్రైన్ జర్నీనే. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, ప్రయాణ సౌలభ్యంతో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం ట్రైన్. మీరెప్పుడైనా గమనించారా? రైలు ప్రయాణాలలో రైళ్లు సాధారణముగా ఉదయం సమయాల్లో నిదానంగా వెళ్తుంటాయి. కానీ, రాత్రి సమయాల్లో చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి.
Advertisement
కాస్త ఆలస్యంగా బయలుదేరిన రైళ్లయినా సరే రాత్రి సమయంలో వేగంగా ప్రయాణించి దూరాన్ని తగ్గించేసుకుంటాయి. అయితే ఇలా ఎలా సాధ్యం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఉదయం సమయంలో చాలా రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. దానికి తోడు పట్టాలపై దాటే వారు ఎక్కువగా ఉంటారు. ఊరి పొలిమేరల్లో అయితే, కొన్నిసార్లు జంతువులు కూడా పట్టాలపై తిరుగుతుంటాయి. అందుకే అతి వేగం ప్రమాదం. కాబట్టే రైళ్ల వేగానికి కూడా ఉదయం సమయంలో పరిమితి ఉంటుంది.
Advertisement
కానీ, రాత్రి వేళల్లో జనసంచారం మందగిస్తుంది. రైలు పైలట్ కు ఇది అనువైన సమయం. అధిక వేగం గురించి, ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆందోళన కానీ అంతగా ఉండదు. అంతేకాకుండా రైల్వే ట్రాక్ లపై ఏమైనా నిర్వహణ పనులు కొనసాగుతున్నా కూడా రైళ్లు ఆకస్మికంగా ఆగిపోతుంటాయి. కానీ, రాత్రి వేళల్లో ఇలాంటి అడ్డంకులు ఉండవు. అందుకే రైళ్లు వేగంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ?
గుంటల కోసం, పవన్ కళ్యాణ్ గుంట పూజ !
ఉపాసన జతకంపై జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు… చరణ్ కు కొడుకు పుడితే జరిగేది ఇదే ?