Home » సిమ్ కార్డు ఒక‌వైపు మాత్రమే ఎందుకు క‌ట్ చేసి ఉంటుందో తెలుసా..?

సిమ్ కార్డు ఒక‌వైపు మాత్రమే ఎందుకు క‌ట్ చేసి ఉంటుందో తెలుసా..?

by AJAY
Ad

సిమ్ కార్డు ఒక‌వైపు మాత్ర‌మే క‌ట్ చేసి క‌నిపిస్తుంది. అయితే అలానే సిమ్ కార్డు ఆకారం ఎందుకు ఉంటుంది. మిగ‌తా మూడు వైపులా మాత్రం ఎందుకు క‌ట్ చేసి ఉండ‌దు అని చాలా మందికి డౌట్ వ‌స్తుంది. కాబ‌ట్టి అలా సిమ్ కు ఒక‌వైపు ఎందుకు క‌ట్ చేసి ఉంటుందో తెలుసుకుందాం….సిమ్ కార్డులో గోల్డ్ క‌ల‌ర్ లో ఒక పార్టు క‌నిపిస్తుంది. ఆ పార్టునే చిప్ అని అంటారు. ఆ చిప్ లో పిన్స్ అనే చిన్న చిన్న భాగాలుగా విడ‌గొట్టి ఉంటుంది.

Advertisement

Advertisement

అయితే అందులో ఉండే పిన్స్ అన్నీ ఫోన్ లో ఉండే సిమ్ స్లాట్ లోని ఒక్క‌క్క పిన్ కు అటాచ్ అవ్వాలి…అంతే కాకుండా సిమ్ లోని పిన్ సెల్ లోని పిన్ ఒకేలా ఉన్న‌వాటికే ఆనుకోవాలి. అలా ఆనుకోవాలంటే ఫోన్ లో ఉండే స్లాట్ లో సిమ్ కార్డును ఒకే పొజిష‌న్ లో అమ‌ర్ఛాలి. కాగా ఆఫోన్ లో ఉన్న స్లాట్ కు క‌ట్ అయిన విధంగా స్లాట్ ఉంటుంది. కాబ‌ట్టి సిమ్ కు కూడా అలాంటి క‌టింగ్ నే ఇస్తారు. అలా క‌టింగ్ ఇవ్వ‌డం వ‌ల్ల చదువుకోని వాళ్లు కూడా సిమ్ ను సుల‌భంగా వేయ‌గలుగుతారు.

అదే అన్ని వైపులా ఒకే విధంగా ఇచ్చి క‌టింగ్ ఇవ్వ‌కపోయి ఉంటే సిమ్ కార్డును ఎలా వేయాలో అర్థం కాక చ‌దువుకోని వారికి ఇబ్బందులు ఉండేవి. ఉదాహ‌ర‌ణ‌కు ఏటీఎం ద‌గ్గ‌ర మిష‌న్ లో కార్డ్ పెట్ట‌డంతో చాలా మంది ప‌డే ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. కానీ సిమ్ వేసేట‌ప్పుడు అలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. ఇక సిమ్ సైజుల్లో అనేక మార్పులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నానో….మ్రైక్రో అంటూ సిమ్ ప‌రిమాణంలో మార్పులు వచ్చినా కూడా ఆకారంలో మాత్రం మార్పు రాలేదు.

Visitors Are Also Reading