నదులు, ఆలయంలో కొలనులు వంటివి కనబడితే మనం డబ్బులు వేస్తూ ఉంటాము. నదిలో నాణేలు విసిరడం వెనక కారణమేంటి అనేది చాలామందికి తెలియదు. పెద్దవాళ్లు చెప్పారు కదా మనం కూడా ఏదో కోరిక కోరుకుని డబ్బులు వేసేద్దాం అని అని నాణేలు వేస్తూ ఉంటారు అయితే దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందని చాలామందికి తెలియదు. ఇదివరకు చూసుకున్నట్లయితే మనకి రాగి నాణేలు ఉండేవి. వాటినే వాడేవారు. దేశంలోని కరెన్సీ రాగి నాణేల రూపంలో ఉండేది.
Advertisement
Advertisement
వంట చేయడానికి ఆహార పదార్థాలని తినడానికి కూడా రాగి పాత్రలని ఉపయోగించేవారు రాగి స్వచ్ఛమైనది పవిత్రమైనది అని అప్పట్లో భావించేవారు. రాగి లోని ఔషధ గుణాలు కారణంగా రాగి పాత్రలని వాడేవారు. అయితే రాగి నాణేలని నదిలో లేదంటే కొలనులో వేయడం వలన రాగి నీటిలోని మురికిని తొలగించేది. నీటిని శుభ్రం చేసే గుణం ఉంది కనుక నదులలో నీటిని పరిశుభ్రంగా ఉంచడానికి అప్పట్లో రాగి నాణేలని నదుల్లో వేసేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు పాటించేవారు కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఉండే రూపాయి కాసులని వేస్తుంటారు. నమ్మకం వల్లే డబ్బులు వేస్తున్నారు ఇంకా.
Also read:
- ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకండి.. ఎన్నో సమస్యలు వస్తాయి…!
- నీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
- ఈ అలవాట్ల వల్లే.. యువత పాడైపోతోంది.. జాగ్రత్తగా వుండండి..!