Home » అక్కినేని ఫ్యామిలీ భ‌ర‌ణం ఇస్తామంటే స‌మంత ఎందుకు నో చెప్పింది..? కార‌ణం అదేనా..?

అక్కినేని ఫ్యామిలీ భ‌ర‌ణం ఇస్తామంటే స‌మంత ఎందుకు నో చెప్పింది..? కార‌ణం అదేనా..?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. ఒకే ర‌క‌మైన సినిమాల‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు అతుక్కుపోకుండా స‌మంత ప్రయోగాత్మ‌క చిత్రాల‌లో డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టిస్తూ అద‌ర‌గొడుతోంది. పుష్ఫ‌, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ త‌ర‌వాత సామ్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది.

Advertisement

అయితే క్రేజ్ వ‌చ్చిన స‌మ‌యంలోనే స‌మంత అనారోగ్యం భారిన ప‌డ‌టం బాధాక‌రం. ప్ర‌స్తుతం సామ్ మ‌యోసైటిస్ బారిన ప‌డ‌టంతో దానికి చికిత్స తీసుకుంటుంది. ఇదిలా ఉంటే స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వీరి విడాకులు జ‌రిగి ఏడాది అవుతున్నా వీరికి సంబంధించిన ర‌క‌ర‌కాల వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Advertisement

స‌మంత నాగ‌చైత‌న్య ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సాధార‌ణంగా విడాకులు తీసుకున్న‌ప్పుడు భార్య‌లు భ‌ర‌ణం తీసుకోవ‌డం కామ‌న్..సెల‌బ్రెటీలు అయినా భార్య‌ల‌కు భ‌రణం చెల్లించాల్సిందే. కాగా అప్ప‌ట్లో స‌మంత‌కు చైతూ 240 కోట్ల భ‌ర‌ణం ఇవ్వాల‌ని అనుకున్నాడ‌ట‌.

కానీ అందులో నిజం లేద‌ట‌. చైతూ ఫ్యామిలీ స‌మంత‌కు 100 నుండి 200 కోట్ల భ‌ర‌ణం ఇవ్వాల‌ని అనుకున్నార‌ట‌. కానీ స‌మంత ఆ భ‌ర‌ణం తీసుకునేందుకు ఒప్పుకోలేద‌ట‌. త‌న కాళ్ల పై తాను నిల‌బ‌డ‌గ‌ల‌ను అనే ధైర్యం..మ‌రియు   ఆడ‌వాళ్లు ఏమీ త‌క్కువ కాదు అనే భావ‌న‌తో స‌మంత భ‌ర‌ణం తీసుకోవ‌డానికి ఒప్పుకోలేద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

ALSO READ: చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో గోడకు వేలాడదీశారా..? అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..!

Visitors Are Also Reading