ఏమ్మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల తార సమంత. మొదటి సినిమాతోనే సమంత ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంత చైతూ ల మధ్య స్నేహం ఏర్పడింది. కానీ చాలా ఏళ్ల తరవాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే కాకుండా కొంత కాలం డేటింగ్ లో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి 2014లో వివాహం చేసుకుని ఒకటయ్యింది.
కానీ వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. సరిగ్గా ఆరేళ్ల వైవాహిక జీవితం తరవాత తాము విడిపోతున్నట్టు ఈ జంట ప్రకటించింది. గతేడాది డిసెంబర్ లో తాము విడాకులు తీసుకున్నట్టు సమంత మరయు నాగచైతన్య ఇద్దరూ ప్రకటించారు. ఇక వీరి విడాకుల వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతే కాకుండా మళ్లీ కలుస్తారేమోనని ఆశ పడ్డారు. కానీ అలా జరగలేదు.
Advertisement
Advertisement
ఇక సమంత విడాకుల తరవాత ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక విడాకుల తరవాత సమంత గ్లామర్ డోస్ ను సైతం పెంచేసింది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది. మరోవైపు చైతూ కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అంతేకాకుండా థాంక్యూ అనే సినిమాలోను నటిస్తున్నాడు.
ఇక వీరిద్దరూ ప్రత్యక్షంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం లేదు కానీ పరోక్షంగా ఒకరిపై మరొకరు విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాగా తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. హాలీవుడ్ లో థోర్ లవ్ అండ్ థండర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేసారు. కాగా ఈ సినిమా పోస్టర్ ను సమంత సోషల్ మీడియాలో స్టోరీగా పెట్టి డెడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో ఆమెకు సినిమా ట్రైలర్ నచ్చలేదా…అని అనుమానం వ్యక్తం చేశారు. మరో వైపు ఇంతలోనే ఆ స్టోరిని డిలీట్ చేసింది. దాంతో సమంత ఎందుకు ఇలా చేసింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.