రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వేయి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సైతం రాబట్టింది. సినిమాలోని గ్రాఫిక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అయితే ప్రతియేడాది భారత్ నుండి ఆస్కార్ కు సినిమాలను నామినేట్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ కు ఈ యేడాది ఆర్ఆర్ఆర్ సినిమా కూడా నిలిచింది. కానీ ఆర్ఆర్ఆర్ ను వెనక్కి నెట్టి చెల్లో షో ఆస్కార్ బరిలో నిలిచింది. అసలు చెల్లో షో అనే గుజరాతి సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు.
Advertisement
అయినప్పటికీ ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. దాంతో అలసు విడుదల కాని సినిమా ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం సాధించిన సినిమాను ఎలా వెనక్కి నెట్టిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చెల్లో అంటే చివరి అని అర్థం చెల్లో షో అంటే చివరి షో అని అర్థం వస్తుంది.
Advertisement
ఈ సినిమాను బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ నుండి నామినేట్ చేశారు. ఈ సినిమాకు పాన్ నలిన్ దర్శకత్వం వహించారు. అయితే ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ ను ఎలా వెనక్కి నెట్టిందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను విదేశీయులు ఏమీ ఆపలేదు.
మనదేశంలోని ఆస్కార్ జ్యూరీ సభ్యులే ఆర్ఆర్ఆర్ ను కాకుండా చెల్లో షోను నామినేట్ చేశారు. సినిమా ఎలా ఉన్నా ఫైనల్ గా జ్యూరీకి నచ్చిన సినిమాలే వెళతాయి కాబట్టి వారికి నచ్చిన చెల్లో షోను పంపించారు. ఇక గతంలోనూ బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన భజరంగీ బాయిజాన్, దంగల్ సినిమాలకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.