Home » సీఎంకి భయపడి ఆ సినిమా చేయకుండా పారిపోయిన రజినీకాంత్..! ఎందుకో తెలుసా..?

సీఎంకి భయపడి ఆ సినిమా చేయకుండా పారిపోయిన రజినీకాంత్..! ఎందుకో తెలుసా..?

by Mounika
Ad

నాలుగు శతాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోలలో రజనీకాంత్ కూడా ఒకరు. కేవలం ఈయన నటించిన చిత్రాలు తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినీ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతాయి. రజనీకాంత్ కి  తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. రజినీ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువదించబడి సూపర్ హిట్స్ సక్సెస్ ని అందుకున్నాయి. అనేక భాషలో రజనీకాంత్ నటించిన చిత్రాలు 80 శాతం పైగా సక్సెస్ ని అందుకున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో  నటించిన రజనీకాంత్ ఒక సినిమాలో మాత్రం నటించడానికి సీఎంకి భయపడి పారిపోయారట.

Advertisement

ఇంతకీ రజనీకాంత్ నటించడానికి భయపడిన ఆ సినిమా ఏమిటి.? దాని అసలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ ని అందుకున్నాయి. జీన్స్, ప్రేమికుడు,అపరిచితుడు, ఐ, ఒకే ఒక్కడు రోబో, రోబో 2.0 వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు  కలెక్షన్స్ పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో వేరే చెప్పడం అవసరం లేదు .అయితే ఈ సినిమాలన్నింటిలోకెల్లా ఒకే ఒక్కడు సినిమా శంకర్ కెరియర్లో చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

Advertisement

ఒకే ఒక్కడు చిత్రం తీసే సమయంలో డైరెక్టర్ శంకర్ కి ఎన్నో వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఈ సినిమా అప్పటిలో తమిళనాడు సీఎంకి వ్యతిరేకంగా రావడంతో చాలామంది భయపడ్డారట. కానీ శంకర్ మాత్రం చాలా ధైర్యంగా ఒకే ఒక్కడు చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ  కథని అమెరికన్ టీవీ రిపోర్టర్ అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా రాసుకోవడం జరిగిందట. అయితే ఈ సినిమాలో ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశంపై కథ సాగుతుంది.

దానికోసం శంకర్ ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని బేస్ చేసుకుని కథ రాసుకొని అన్ని విషయాలు హైకోర్టు జడ్జిని కలిసి తెలుసుకున్నారట. అయితే శంకర్ ముందుగా ఈ సినిమా కథను రజినీకాంత్ తో తీయాలని అనుకున్నారట. కానీ ఈ స్టోరీ విన్న రజినీకాంత్ ఈ కథ కాస్త తమిళనాడు సీఎంకి  వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఈ సినిమాలో నేను కనుక నటిస్తే తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. నేను చేయను బాబోయ్ అని ఒకే ఒక్కడు మూవీని రజనీకాంత్ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత శంకర్ కమల్ హాసన్, విజయ్, టాలీవుడ్ హీరో వెంకటేష్ వంటి వాళ్లకి చెప్పిన కూడా ఫలితం లేకపోవడంతో చివరికి అర్జున్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు శంకర్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రీమేక్ మూవీస్ గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా ?

Abbas: విశాల్ మాట్లాడిన ఆ మాటలకి చాలా బాధ పడ్డా.. ఎమోషనల్ అయిన అబ్బాస్..!

నటి సుజాత జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిస్తే కన్నీరు పెట్టకుండా ఉండరు..!

 

Visitors Are Also Reading