Home » ఈ ప్రాంతంలో రోడ్లు ఎందుకు నీలం రంగులో ఉంటాయి..? కారణం ఏమిటో తెలుసా..?

ఈ ప్రాంతంలో రోడ్లు ఎందుకు నీలం రంగులో ఉంటాయి..? కారణం ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

ఆకాశం రంగులో రోడ్లు ఉండడం చూశారా..? బ్లూ కలర్ లో రోడ్స్ ఉన్నాయని తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఎందుకు బ్లూ కలర్ లో రోడ్ల ని ఇక్కడ వేశారు..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రకరకాల రోడ్లు ఉన్న ఫోటోలు మనకి కనబడుతుంటాయి కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే నీలిరంగులో ఉంటాయి. అన్ని రోడ్లు నల్లగా ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో మాత్రం రోడ్లు నీలం రంగులో ఉంటాయి. ఇలాంటి రోడ్డుని మీరు ఎప్పుడైనా చూసారా..? ఈ దేశంలో నలుపుతో ఉన్న రోడ్డుని రంగు మార్చడానికి ప్రాజెక్ట్ ని చేపట్టారు ఇక్కడ రోడ్లు నీలం రంగులో ఉంటాయి. అయితే నీలం రంగు చూడడానికి బాగుంటుంది. 

Advertisement

ఆకర్షణీయంగా కనబడుతుందని ఈ రంగు వేయలేదు. దాని వెనుక పెద్ద కారణమే ఉంది. రోడ్లకి నలుపు రంగు కాకుండా బ్లూ కలర్ తో పెయింట్ వేసే ప్రయత్నాన్ని ఇక్కడ చేశారు. రోడ్లకి నలుపు రంగు కాకుండా బ్లూ కలర్ ని వేయడం జరిగింది. ఖతార్ లో ఈ పైలెట్ ప్రాజెక్టుని 2019 సంవత్సరంలో ప్రారంభించింది. దోహాలో కొన్ని వీధుల్లో కూడా నీలం రంగులో ఉంటాయి. రోడ్లు నీలం రంగులో మార్చడానికి కారణం ఏమిటంటే నీలం రంగు ఏసీ పెయింట్ పూత పూసిన తర్వాత బ్లూ కలర్ లోకి మారుతుంది.

Advertisement

దోహాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీలం రంగు రహదారిని ఏర్పాటు చేశారు అక్కడ వేడి కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బ్లూ కలర్ ద్వారా రోడ్డు ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటుగా ఇంకా ఎంతో లాభం ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత పై 50% తేడా వచ్చింది 20 నుండి 25° దాకా ఉష్ణోగ్రత ఉంటుందట అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో అయితే ఒక మిల్లీమీటర్ మందపాటి నీలం పూత పూస్తారు, దీంతో ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయొచ్చట. సూర్యుని రేడియేషన్ ని యాభై శతం దాక తగ్గించొచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు అందుకనే ఇక్కడ రోడ్లు నీలం రంగులోకి మార్చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading