సినిమాల్లోకి రావాలని స్టార్ గా ఎదగాలని చాలా మంది కలలు కంటారు. కానీ ఆ కలలను అతికొద్ది మంది మాత్రమే నెరవేర్చుకుంటారు. అలా తను కన్న కలలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్న నటి సావిత్రి. ఒకప్పుడు తెలుగుతో పాటూ ఇతర ఇండస్ట్రీలలోనూ సావిత్రి స్టార్ హీరోయిన్ గా రానించారు. అప్పట్లో సావిత్రి తో సినిమాలు చేయాలని దర్శకనిర్మాతలు సైతం క్యూ కట్టేవారు. సావిత్రి వరుస సినిమాలతో అంత బిజీగా ఉండేవారు.
Advertisement
తెలుగు గడ్డపై పుట్టిన సావిత్రి తమిళ చిత్రపరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవదాసు సినిమా ద్వారా సావిత్రి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరవాత ఇతర భాషల్లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. ఇక సావిత్రి తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు జమిని గణేషన్ ను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండే సావిత్రి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి.
Advertisement
కోట్లు సంపాదించిన సావిత్రిని అయినవాళ్లే దారుణంగా మోసం చేశారు. తన అనుకున్నవాళ్లే మోసం చేయడంతో చివరికి సావిత్రి ఆస్తులన్నీ కోల్పోయారు. అంతేకాకుండా చివరిరోజుల్లో సావిత్రి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. అనారోగ్యంతో పాటూ అప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే నిజానికి సావిత్రికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సన్నిహితులు ఉన్నారు.
కానీ ఆమెకు చివరిరోజుల్లో చేయి అందించకపోవడానికి ఆమె మొండి వైఖరే కారణమని సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా సార్లు సావిత్రిని వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారట. అంతే కాకుండా ఆమెకు సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా అనేకసార్లు వ్యసనాలను మానేయాలని హెచ్చరించారట. అయినప్పటికీ ఆమె వినకపోవడం వల్లనే చివరిరోజుల్లో ఎవరూ దగ్గరకు వెళ్లలేదని సన్నిహితులు చెబుతున్నారు.