Home » కావ్యపాప రషీద్ ను వదిలేసి వీరిని ఎందుకు తీసుకుందో తెలుసా..?

కావ్యపాప రషీద్ ను వదిలేసి వీరిని ఎందుకు తీసుకుందో తెలుసా..?

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగు విజయాలు సాధించిన హైదరాబాద్ జట్టుపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు… మెగావేలం తర్వాత మాత్రం నిప్పులు కురిపించారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనలేదని విమర్శలు చేసారు.

Advertisement

అలాగే వేలంముందు రిటెన్షన్ ప్రక్రియలో చాలా మంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది ఆరెంజ్ ఆర్మీ. అందులో ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఒక్కడు. అయితే రిటెన్షన్ సమయంలో రషీద్ 16 కోట్లు డిమాండ్ చేసాడని.. కానీ తాము అంత ఇవ్వలేకపోయామని ఈ మధ్యే సన్ రైజర్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ చెప్పిన సంగతి తెలిసిందే. రషీద్ ను వదిలితే వదిలారు.. కానీ జట్టులో భువనేశ్వర్, నటరాజన్, జాన్సన్, ఉమ్రాన్‌ మాలిక్ లను ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ లో గుజరాత్ కు ఆడుతున్న రషీద్ బాగానే రాణిస్తున్నాడు. అలాగే హైదరాబాద్ జట్టులో ఉన్న భువీ, నట్టూ, జాన్సన్, ఉమ్రాన్‌ లు బాగానే ఆడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… రషీద్ విలువ ఈ ఐపీఎల్ లో 16 కోట్లుకాగా… ఈ నాలుగు బౌలర్ల విలువ కూడా 16 కోట్లే. అంటే అంతే ఖర్చుతో.. ఒక్కరి బదులు నలుగురిని సన్ రైజర్స్ ఓనర్ కావ్య పాప తీసుకుంది అన్నమాట. అందుకే ఇప్పుడు కావ్య మారన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

వరుసగా నాలుగో విజయంతో సన్ రైజర్స్ హవా…!

Visitors Are Also Reading