Home » నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

నందమూరి వారసుడే అయినా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ అవ్వలేకపోయారు…? 5 కారణాలు ఇవేనా..!

by AJAY
Ad

నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బ‌స్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాతో క‌ల్యాణ్ రామ్ ట్రాక్ లోకి వ‌చ్చార‌ని నంద‌మూరి స‌త్తా చాటార‌ని అభిమానులు కుషీ అవుతున్నారు. నిజానికి క‌ల్యాణ్ రామ్ 2003లో తొలిచూపులోనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగాడు.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కానీ క‌ల్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసినా అందుల్లో చెప్పుకోదగ్గ సినిమాల‌ను మాత్రం వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చు. కాగా క‌ల్యాణ్ రామ్ నంద‌మూరి ఫ్యామిలీ నుండే వ‌చ్చినా ఎన్టీఆర్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకోలేకపోవ‌డానికి ఐదు కార‌ణాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

అవేంటో ఇప్పుడు చూద్దాం….ఎన్టీఆర్ చూడాలని ఉంది సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. కానీ ఆ త‌ర‌వాత వ‌చ్చిన స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న డ్యాన్స్ డైలాగుల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఆ త‌ర‌వాత వ‌రుస హిట్ల‌ను అందుకున్నాడు. కానీ క‌ల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభంలో క‌థ‌ల ఎంపిక‌లో త‌డ‌బ‌డ్డాడు. దాంతో వ‌రుస ఫ్లాప్ లు ప‌డ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ చూడ్డానికి అన్న‌గారిలా ఉన్నార‌ని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిసింది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా ఎక్కువ‌గా క్రేజ్ ను సంపాదించుకున్నారు.

కానీ క‌ల్యాణ్ రామ్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. ఎన్టీఆర్ కేవ‌లం న‌ట‌న పై మాత్ర‌మే దృష్టి పెట్టాడు. కానీ క‌ల్యాణ్ రామ్ మాత్రం సినిమాలను నిర్మించ‌డం కూడా చేసి న‌ట‌న‌పై స‌రిగ్గా ఫోక‌స్ పెట్ట‌లేక‌పోయాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ ఎక్కువ‌గా క‌లుపుగోలు మ‌నిషి ఎవరితో అయినా ఇట్టే క‌లిసిపోతాడు. ఎన్టీఆర్ మాట‌కారి కూడా దాంతో త‌న మాట‌ల‌తో ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. కానీ క‌ల్యాణ్ రామ్ మాత్రం సైలెంట్…పెద్ద‌గా మాట్లాడ‌రు. ఇలా క‌ల్యాణ్ రామ్ కు స్టార్ స్టేట‌స్ రాక‌పోవ‌డానికి అనేక కార‌ణాలున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading