తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల్లో రూ.550 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) గత కొన్నాళ్లుగా ఈ కోణంలో విచారణ జరుపుతుండగా, శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని విజయవాడలోని అవినీతి నిరోధక కోర్టులో హాజరుపరిచారు.
Advertisement
దీంతో విజయవాడ అవినీతి నిరోధక న్యాయస్థానం చంద్రబాబు నాయుడును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. అతడికి 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కి నేపథ్యంలో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనని అరెస్ట్ చేయడంపై తప్పుపడుతూ చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలిచారు.
Advertisement
కొందరు చంద్రబాబు నాయుడుకి రోడ్లపై వెళ్లి నిరసన తెలియజేస్తుంటే.. మరికొందరు తమ ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేయడం తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తారక్ స్పందించకపోవడానికి గల కారణం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.
కొన్ని సమయాలలో తెలుగుదేశం పార్టీపై ఎన్టీఆర్ స్పందించినా తీరును కొంతమంది కావాలనే వివాదాలకు దారి తీసేలా చేశారు. అందువల్ల తారక్ చంద్రబాబు అరెస్ట్ విషయంపై స్పందించే అవకాశాలు అయితే లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రస్తుతం తారక్ భావించడం లేదని సమాచారం. ఇక ఈ టైంలో ఆయన ఏ కామెంట్స్ చేసినా కూడా వివాదాలు దారి తీస్తాయని, అందుచేత ఈ విషయంపై దూరంగా ఉంటున్నారంటూ సమాచారం వినిపిస్తుంది.
Also Read :
ఉపాసన ధరించిన ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా..? షాక్ అవుతారు..!
మహేష్ బాబు పక్కన ఉన్న ఇతన్ని మీరు గుర్తు పట్టారా..?