Home » క‌థ న‌చ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కార‌ణాలు ఇవేనా..!

క‌థ న‌చ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కార‌ణాలు ఇవేనా..!

by AJAY
Ad

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ చైతన్య. జోష్ సినిమాతో నాగచైతన్య ప్రేక్షకులకు పరిచయ‌మైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున కుమారుడు కావడంతో చైతన్యపై ప్రేక్షకులు అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అంతేకాకుండా నాగార్జున కు బడా బ్యానర్ ఉండటంతో లాంచింగ్ కూడా భారీగా ఉంటుందని ఊహించారు. కానీ నాగార్జున మాత్రం తన కొడుకు చైతును పరిచయం చేసే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్ప‌గించారు.

Advertisement

దిల్ రాజు అప్పుడే నిర్మాతగా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఓవైపు నిర్మాతగా మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ లో ఉన్న దిల్ రాజు చైతూను పరిచయం చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాను నూతన దర్శకుడు వాసు వర్మ తెరకెక్కించగా ఈ చిత్రంలో నాగచైతన్య కు జోడిగా సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా జెడి చక్రవర్తి నటించారు.

Advertisement

ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కథకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా క‌థ బాగున్న‌ప్ప‌టికీ అనుకున్న మేర విజయం సాధించ‌క‌పోవడానికి ఐదు కారణాలు ఉన్నాయని సినీప్రియులు భావిస్తుంటారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతే కాకుండా యాక్టింగ్ ప‌రంగా కూడా చైతూ నిరాశ‌ప‌రిచాడు.

ఈ సినిమాకు హీరోయిన్ కూడా మైనస్ గా నిలిచింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అస్స‌లు వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. శివ సినిమా ప్రభావం ఈ సినిమాపై పడిందని ఆ సినిమాలోని కొన్ని సీన్లను పోలి కొన్ని సీన్లు ఉండటం కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అక్కినేని వారసుడి ఎంట్రీ అంటే అభిమానులు భారీ స్థాయిలో ఊహించుకున్నారు. కానీ ఆ రేంజ్ లో ఈ సినిమా నిర్మాణ విలువలు లేకపోవడం కూడా ప్రేక్షకులను నిరాశ పరిచినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త దర్శకుడు కాకుండా ఎవరైనా సీనియర్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేదని చైతూను కూడా స‌రిగ్గా చూపించేవాడ‌ని ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు.

Visitors Are Also Reading