Home » జగదేక వీరుడు అతిలోక సుందరికి మొదటి మూడు రోజులు ప్లాప్ టాక్ ఎందుకంటే..?

జగదేక వీరుడు అతిలోక సుందరికి మొదటి మూడు రోజులు ప్లాప్ టాక్ ఎందుకంటే..?

by Sravya
Ad

సినీ ఇండస్ట్రీలో అద్భుతాలను సృష్టించడం కొత్తేమి కాదు. ఎప్పటి నుండో చూస్తున్నాం. అయితే అదే అందరికీ సాధ్యం కాదు. ఎంతో డెడికేషన్ పట్టుదల అన్నిటికీ మించి కృషి ఉంటే సాధ్యమవుతుంది. ఇండస్ట్రీలో అద్భుతాలను సృష్టించిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది. ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చి 30 ఏళ్ళు పూర్తయింది. అయినా కూడా సినిమాను ఎవరూ మర్చిపోలేదు.

Advertisement

ఈ కథకు పాత కొత్త అని తేడా కూడా లేదు. ఏ జనరేషన్ వచ్చినా కూడా కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా కూడా అందరికీ గుర్తుంది పోతుంది. ఈ సినిమా 13 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. నందమూరి తారక రామారావు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ వచ్చిన అడవి రాముడు కూడా ఇలాంటి రికార్డుని క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ స్థానాన్ని దక్కించుకుంది. చాలా బ్లాక్ బస్టర్స్ తర్వాత వైజయంతి మూవీ బ్యానర్ పై నిర్మించిన సి అశ్విని దత్ బ్రతికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండేది. అదే ఎన్టీఆర్ చేసిన జగదేకవీరుని కథ. జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 మే 9న రిలీజ్ అయింది మొదటి మూడు రోజులు సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

దీనికి కారణం ఏంటంటే రిలీజ్ సమయానికి ఆంధ్రప్రదేశ్ తుఫాన్ తాకిడికి గురైంది. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం వలన సెంటర్లకు ప్రింట్లు ఆలస్యంగా వెళ్లాయి. మ్యాట్నీ నుండి ప్రదర్శన మొదలుపెట్టారు. జనం థియేటర్లోకి వచ్చే పరిస్థితిలో కూడా లేరు. దీంతో అశ్విని దత్ షాక్ అయ్యారు. కానీ నాలుగవ రోజు నుండి సినిమా సూపర్ కలెక్షన్స్ ని రాబట్టడం మొదలుపెట్టింది. శ్రీకాకుళంలో ఒక థియేటర్ లో వర్షం వస్తున్నా కూడా జనం మూవీ చూస్తూ ఉంటే ఫైరింగ్ ఎలా సహాయంతో థియేటర్లన్నీ వర్షం నీటిని బయటికి తోసారు. అంతటి భారీ వర్షంలో కూడా ప్రేక్షకులు సినిమాను చూడడానికి వచ్చారు ఏదేమైనా ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading