ప్రతీ ఇంటి ముందు ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందేనా..? యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్..శ్రీ మహలక్ష్మీ నారాయణి స్వరూపిని అయిన తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలుమధ్య భాగంలో సమస్థ దేవతలు, తులసి పై భాగమున సర్వవేదాలతో కొలువై ఉన్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని అంతటి పూజనీయమైనది ఆ తులసి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. ప్రతీ ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటారు. తులసిని లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తుంటారు.
Advertisement
తులసి మొక్క అంటేనే ఎవరైనా ఎంతో అతి పవిత్రంగా చూస్తారు. మరి ఆ తులసి వలన మానవునికి కలిగే ప్రయోజం ఏమిటో పరిశీలిస్తే అర్ధం అయ్యేది ఏమిటంటే తులసి మొక్క ఒక రోజులో 22 గంటలపాటు ఆక్సిజన్ ను విడిచిపెడుతుందని కొంత మంది పరిశోధనల ద్వారా తెలియజేశారు. అందుకే జపాన్‌లోని ప్రతి ఇంటిలో తులసిమొక్కలు పెంచుతున్నారట.
Advertisement
ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం తులసి లక్ష్మీఅమ్మవారి స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.మన పూర్వీకులు దేనినైనా పూజించారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియనివి అంతే తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని ఆక్సిజ న్ వదులుతాయి.
రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్ ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు.