హిందూమతంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. ఏ పనులు ఎప్పుడు చేయాలి.. ఏ పనులు ఎప్పుడు చేయకూడదు అని కూడా ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం హెయిర్ కట్ చేయించుకోకూడదని..గోర్లు కూడా కత్తిరించుకోకూడదని ఓ ఆచారం ఉంది. అయితే మంగళవారం ఎందుకు కటింగ్ చేసుకోకూడదు…ఎందుకు గోర్లు కత్తిరించుకోకూడదు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇంట్లో వాళ్లను అడిగితే అతి ఆచారం అంతే మన పెద్దవాళ్లు చేసుకోలేదు. మనం కూడా చేసుకోకూడదు అనే ఆన్సర్ ఇస్తుంటారు.
నిజానికి కటింగ్ చేసుకోకూడదు అని వాళ్లకు తెలుసుకానీ అసలు ఎందుకు చేసుకోకూడదు అనేది వారికి కూడా తెలియదు. కాబట్టి మంగళవారం కటింగ్…గోర్లు కత్తిరించడం ఎందుకు చేయకూడదో ఇప్పుడు చూద్దాం…మంగళవారం అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ్ అని కూడా అంటారు. ఇది మార్స్ మంగళ్ ద్వారా పాలించబడుతుంది. ఈ గ్రహం ఎరుపువర్ణానికి చిహ్నం..ఈ గ్రహం అధిక వేడిని కలిగి ఉంటుంది. మానవశరీరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Advertisement
Advertisement
ALSO READ : అబ్బాయిలు మొలతాడు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అంతే కాకుండా ఇది రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెబుతుంటారు. ఆ రోజున శరీరంపై ఎక్కువగా గాయాలు అవ్వడానికి ఆస్కారం ఉంటుందట. గాట్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్లనే ఆ రోజు కటింగ్ చేసుకోడం..గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదని ఆనాధిగా ఆచారం వచ్చింది. కాబట్టే మంళవారం గోర్లు కత్తిరించడం గానీ కటింగ్ చేయించుకోవడం గానీ చేయవద్దంటారు. అంతే కాకుండా ఆ రోజు కటింగ్ షాప్ లు సైతం మూసి ఉంచి బార్బర్ లు అందరూ సెలవు తీసుకుంటారు.