చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాలలో డిజే టిల్లు కూడా ఒకటి. ఈ సినిమాలో సిద్దు జొన్నగడ్డల హీరోగా నటించాడు. ఈ సినిమా కంటే ముందు సిద్దు చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఒక్క గుంటూరు టాకీస్ తోనే కాస్తో కూస్తో గుర్తింపు వచ్చింది. కానీ డిజే టిల్లు తో మాత్రం సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి విజయం సాధించిన డీజే టిల్లు సినిమాకు ప్రస్తుతం సీక్వెగా పార్ట్ 2 కూడా తెరకెక్కుతోంది.
Advertisement
అయితే పార్ట్ 2 కు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డీజే టిల్లు సినిమా పార్ట్ 2 కు హీరోయిన్ లు కలిసిరావడం లేదు. ఈ సినిమాకు ఏ హీరోయిన్ ను తీసుకున్నా మధ్యలోనే వెల్లిపోతున్నారు. దాంతో టిల్లుగాడికి హీరోయిన్ లు కరువయ్యారు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. డీజే టిల్లు పార్ట్ 1 కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సీక్వెల్ కు కూడా విమల్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది కానీ ఎవో కారణాల వల్ల దర్శకుడు సినిమా నుండి తప్పుకున్నాడు.
Advertisement
ఆ తరవాత ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో దర్శకుడు మారిపోయాడు. అంతే కాకుండా ఫస్ట్ పార్ట్ కు తమన్ స్వరాలు సమకూర్చగా డీజే టిల్లు పార్ట్ 2 కు రామ్ మిరియాల స్వరాలు సమకూరుస్తున్నాడు. అంతే కాకుండా పార్ట్ 1 లో హీరోయిన్ గా నటించిన నేహశెట్టి కూడా సీక్వెల్ నుండి తప్పుకున్నారు. కాదు హీరోనే నేహాశర్మను తప్పించాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక హీరోయిన్ ను తప్పించిన తరవాత హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. కానీ శ్రీలీల ఎక్కువ రోజులు డీజే టిల్లు లో నటించలేక తప్పుకుంది. సిద్దు వైఖరి వల్లనే శ్రీలీల తప్పుకుందనే టాక్ ఉంది. ఆ తరవాత అనుపమ ప్రాజెక్టు లోకి వచ్చింది. కొద్దిరోజుల తరవాత అనుపమ కూడా తప్పుకుంది. ఇక ఇప్పుడు మడోనా సెబాస్టియన్ ను హీరోయిన్ ను ఎంపిక చేశారు. మరి మడోనా అయినా ప్రాజెక్టులో కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.