Home » డబ్బులని ప్రింట్ చేసి.. ఎందుకు ప్రభుత్వం పంచదు..? కారణం తెలుసా..?

డబ్బులని ప్రింట్ చేసి.. ఎందుకు ప్రభుత్వం పంచదు..? కారణం తెలుసా..?

by Sravya
Ad

ప్రతిదీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. మనం తినే తిండి మొదలు వేసుకునే బట్టలు వరకు ప్రతిదీ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డబ్బు లేకపోతే ప్రపంచంలో ఏదీ కూడా లేదు. మనిషి డబ్బు కోసం ఏ పనైనా కూడా చేస్తూ ఉంటాడు పేదవాడు ఒక్క పూట తిండి కోసం డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటే ధనికులు ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇలా ఎవరి వేట వాళ్లది. అయితే ప్రతి ఒక్కరికి ఇలా ఏదో ఒక సందర్భంలో అనిపించే ఉండచ్చు. ప్రభుత్వాలు కరెన్సీని ముద్రించి అందరికీ పంచొచ్చు కదా..? ఎందుకు అలా ప్రభుత్వం చేయదు..? కష్టపడి మనం ఎందుకు సంపాదించుకోవాలి అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది.

సాధారణంగా ఏ దేశమైనా కూడా కరెన్సీ ముద్రణలో కొన్ని పాలసీలని ఏర్పాటు చేసుకుంటుంటాయి. మన దేశం కూడా అంతే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఎంత నగదు ఉంది, ఎలా ముద్రించాలి అన్న వివరాలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. కరెన్సీ ని ముద్రించి చలామణిలోకి తీసుకొస్తుంది. మన దేశ ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు ఆధారంగా కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది ఇతర దేశాల వాళ్లు కూడా తమ పాలసీల ప్రకారం కరెన్సీని ప్రింట్ చేస్తూ ఉంటారు. ఎవరు కూడా అతిగా కరెన్సీని ముద్రించరు.

Advertisement

Advertisement

మన దేశంలో పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించి అందరికీ కొన్ని లక్షల రూపాయలను ఇచ్చారంటే అందరూ ధనికులు అయిపోతారు. ఆహార వస్తువులు ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. డిమాండ్ పెరిగిపోతుంది ధరల విపరీతంగా పెరిగిపోతాయి. అలా కొంత కాలం జరుగుతుంది తర్వాత ఆహారం దొరకదు తినడానికి తిండి కూడా ఉండదు ఇది అస్సలు మంచిది కాదు. గతంలో జింబాబ్వే కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అక్కడ అవసరం లేకపోయినా పెద్ద ఎత్తున కరెన్సీని ప్రింట్ చేశారు ఉత్పత్తి తగ్గిపోయింది ద్రవ్యోల్బణం పెరిగింది. దేశ ఆర్థిక స్థితి కుప్పకూలిపోయింది పది రూపాయలు ఉండే బియ్యం ధర 100కి పెరిగిపోయింది ప్రజల వద్ద ఉన్న సంపద వస్తువులను కొనుగోలు చేసే కొద్ది తరిగిపోయింది. ప్రజలందరూ కూడా పేదరికంలోకి వెళ్లిపోయారు ఇలా ఇన్ని నష్టాలూ జరుగుతాయి కాబట్టి కరెన్సీ ని ప్రభుత్వం ముద్రించి పంచిపెట్టదు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading