Home » అఖిల్ ను ‘అయ్యగారు’ అని ఎందుకు పిలుస్తారు ?

అఖిల్ ను ‘అయ్యగారు’ అని ఎందుకు పిలుస్తారు ?

by Bunty
Ad

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలలో పెద్దగా రాణించినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల మనసులను సొంతం చేసుకున్నాడు. అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్. అఖిల్ తన చిన్నతనంలోనే సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన ముసిముసి నవ్వులతో, అమాయకత్వంతో, అల్లరితో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టారు. ఇక ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదు.

Advertisement

 

తన చదువు పూర్తి చేసుకున్న అనంతరం మళ్లీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. మనం, అఖిల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, హలో వంటి చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా హిట్ సొంతం చేసుకోలేకపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ మూవీ అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఏజెంట్ మూవీ ప్రమోషన్లలో భాగంగా… అక్కినేని అఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అభిమాని మిమ్మల్ని అక్కినేని అఖిల్ అని పిలవాలా… లేకపోతే అయ్యగారు అని పిలవాలా అని అడిగాడు. దీనికి అక్కినేని అఖిల్ స్పందిస్తూ… నన్ను ఒక ఫ్యాన్ ఫస్ట్ టైం అయ్యగారు అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను.

Advertisement

కానీ ఆ తర్వాత ఆ పిలుపును పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అలానే పిలవడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా కూడా అయ్యగారు అనే పిలుపుతోనే మొదలు పెట్టేవారు. అలా అయ్యగారు అయ్యగారు అని ప్రతి ఒక్కరూ పిలుస్తుంటే నాకు పెద్దగా అర్థం కాలేదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అలా పిలుస్తుంటే ఆ పేరుకు నేను ఫిదా అవ్వక తప్పలేదు. ఇక అందరూ నా పేరును మర్చిపోయి అయ్యగారు అని పిలవడం నాకు చాలా బాగా నచ్చింది. అలా అని అక్కినేని అఖిల్ అనే పేరు నచ్చలేదు అని కాదు. ఎప్పటికీ అది నా లైఫ్ లో ఒక పార్ట్ గానే ఉంటుంది అని చెప్పారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత.. రిటైర్మెంట్ చేయనున్న నలుగురు టీమిండియా క్రికెటర్లు ?

పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?

Visitors Are Also Reading