Home » కుక్కలు కరెంట్ స్తంభాలకు ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో మీకు తెలుసా..!

కుక్కలు కరెంట్ స్తంభాలకు ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో మీకు తెలుసా..!

by Sravanthi
Ad

అభివృద్ధి చెందిన దేశాలలో మనుషులకు ఎంత వ్యాల్యూ ఇస్తారో పెంచుకునే కుక్క లకు కూడా ఇంతకంటే ఎక్కువ విలువ ఇస్తారు. మన భారతదేశానికి వస్తే కుక్కలను ఎక్కువగా సంపన్నుల కుటుంబాలు మాత్రమే ఇంట్లో మనుషుల్లా చూసుకుంటారు. ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి.. ఒకటి ఊర కుక్కలు.. రెండోది ఇంట్లో పెంచుకునే కుక్కలు. ఇక ఊరకుక్క ల విషయానికి వస్తే ఇవి చాలా తెలివి కలిగి ఉంటాయి. అది ఏంటో చూద్దాం..!

Advertisement

Advertisement

ఈ కుక్కలు  విసర్జన చేసేటప్పుడు ఒక్కసారి పోయకుండా కొద్దికొద్దిగా, తుప్పలు, రాళ్లు, చక్రాలు, స్తంభాలు వంటి వాటి మీద మాత్రమే పోస్తాయి. అది కూడా ఒకదానిమీద కొంత విసర్జన చేసిన తర్వాత మళ్లీ కొద్ది దూరం ప్రయాణించి మరో వస్తువు మీద విసర్జన చేస్తాయి. ఇలా కుక్కలే కాదు వేటాడే అడవి జంతువులు అయిన తోడేళ్లు గుంపులుగా వెళ్ళినప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవుతాయి.

ఈ వేటాడే సమయంలో ఆహారం కోసం చాలా దూరం ప్రయాణం చేస్తాయి. ఈ సందర్భంలో గుంపులో ఉన్న కుక్కలు విడిపోయి ఆహార అన్వేషణకు వెళ్తాయి. ఈ క్రమంలో మళ్లీ అవి కలుసుకోవడానికి దారి తప్పిపోకుండా ఉండటం కోసం ఈ విధంగా పోతున్నటువంటి దారుల్లో మూత్ర విసర్జన చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ వాసనతో మిగతా కుక్కలు కూడా మళ్లీ గుంపుగా కలుసుకో గలుగుతాయి.

Visitors Are Also Reading