చాలామంది రాత్రిపూట గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టడం వలన పక్కన ఉన్న వాళ్ళ నిద్ర కచ్చితంగా డిస్టబ్ అవుతుంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో గురక సమస్య తక్కువ ఉంటుంది. స్త్రీలలో గురక సమస్య ఉందంటే దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గర్భిణీల్లో ఎక్కువగా గురక సమస్య ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత స్త్రీలు అదనపు బరువు పెరగడం వలన గురక వస్తూ ఉంటుంది. గురక రావడానికి ఇంకొక కారణం ఏంటంటే అలసట.
Advertisement
Advertisement
ఎక్కువ అలసిపోయిన వాళ్ళల్లో కూడా గురక ఎక్కువ వస్తుంది అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళలో కూడా గురక సమస్య ఉంటుంది. కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వలన శ్వాస మార్గంలో అడ్డంకులు వస్తాయి. దీంతో గురక ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి వలన కూడా గురక వస్తుంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. కండరాలికి తగిన విశ్రాంతి ఉండకపోవడంతో గురక వస్తుంది. అసౌకర్యంగా నిద్రపోతే కూడా గురక వస్తుంది. సైనస్ సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉంటే గురక వస్తుంది. ఇలా స్త్రీలలో గురక రావడానికి కారణాలు ఇవి. ఈ సమస్యలు ఉంటే కచ్చితంగా గురక రావచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!