విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈరోజుల్లో ఫ్యామిలీ మూవీస్ బాగా తగ్గిపోతున్నాయి కుటుంబంతో కలిసి చూసే సినిమాలు ఎక్కడో ఎప్పుడో వస్తున్నాయి అటువంటి ప్రేక్షకులకు ఫ్యామిలీ స్టార్ సూపర్ ఆప్షన్ గా కనపడింది. ఈ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
అయితే విడుదలకి ముందు ఈ మూవీలో ఉపయోగించిన బూతులు గురించి తెలిసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబో అదరగొట్టేసింది. అయితే మళ్లీ ఇదే కాంబోలో మూవీ రావడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి ప్రేక్షకులకి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది లవ్ కామెడీతో ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా సాగింది.
Advertisement
సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టిపడేస్తాయి ఆడియన్స్ ని. అయితే అన్ని బానే ఉన్నాయి కానీ కొన్ని పదాలని సెన్సార్ మ్యూట్ చేసింది. అవి పచ్చి బూతులు అవడంతో ఫ్యామిలీ సినిమాలలో ఇటువంటి మాటలు ఏంటని అందరూ షాక్ అవుతారు. కొంతమంది ఇటువంటి డైలాగ్స్ ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినప్పుడు డైలాగుల విషయంలో కొంచెం జాగ్రత్తగా పడితే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కొంచెం ఫ్యామిలీ అని టైటిల్ పెట్టినప్పుడు కాస్త జాగ్రత్త పడి ఉండడం మంచిది చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ గీతగోవిందంలా ఉండొచ్చని చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కానీ ఇటువంటి తప్పులు చేయడంతో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. పరుశురాం ఈ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని చాలామంది ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!