ఆకాశంలో ఎన్నో రకాల అందమైన పక్షులు గుర్తు ఉంటాయి. పక్షుల గుంపులను మనం గమనించి చూసినట్లయితే అవి వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి. ఎందుకు పక్షులు వి ఆకారంలోనే ఎగురుతుంటాయి.. దానికి ఏమైనా కారణం ఉందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. గాల్లో పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. వి ఆకారంలో ఎగిరితే పక్షులు ఈజీగా ఎగరగలవు. గాలి ఒత్తిడి వాటికి ఇబ్బంది కలిగించలేదు ఆ షేప్ లో ఎగరడం వలన వాళ్లకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మిగిలిన పక్షులతో వి ఆకారంలో పక్షులు ఎగరడం వలన ఒక పక్షి మరొక పక్షిని ఢీ కొట్టలేదు.
Advertisement
Advertisement
నాయకత్వం వహించే పక్షి నిర్ణయం ద్వారా మిగిలిన పక్షులు అనుసరించి ఎగురుతూ ఉంటాయి. భేదాభిప్రాయాలు ఉండవు. పక్షులు గుంపుగా ఎగిరినప్పుడు ఆ నాయకుడు ముందు ఉంటాడు. మిగిలిన పక్షులు ఆ పక్షిని అనుసరిస్తాయి. ముందు వెళ్లే పక్షి వేగాన్ని బట్టి మిగిలిన పక్షులు కూడా ఎగురుతూ ఉంటాయి. పైగా వి ఆకారంలో పక్షులు వెళితే వాటి శక్తి తగ్గదు. వాటి శక్తి కూడా చాలా వరకు ఆదా అవుతుంది.
Also read:
- పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి.. అందుకే రోజూ తినండి..!
- రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!
- ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే నీళ్లు సరిగ్గా తాగట్లేదు అని అర్ధం..!