టాలీవుడ్ లో ఉన్న మంచి నటులలో నాజర్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రకైనా నాజర్ న్యాయం చేస్తుంటారు. తన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. అతడు సినిమాలో మహేశ్ బాబు తాత పాత్రలో…. బాహుబలిలో రానా తండ్రిగా విలన్ రోల్ లో నటించిన నాజర్ ఆ పాత్రల్లో జీవించేశాడు. నాజర్ కేవలం తెలులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంటారు కానీ ఆయనకు ఎక్కువ గుర్తింపును తెచ్చిపెట్టింది తెలుగు సినిమాలే. కేవలం విలన్ రోల్స్ మాత్రమే కాకుండా కామెడిని పండించడంలోనూ నాజర్ దిట్ట అనిపించుకున్నారు.
Advertisement
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుడ్ డిమాండ్ ఉన్న నటుడిగా నాజర్ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాజర్ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. చిరంజీవి తను కలిసి ఒక యాక్టింగ్ స్కూల్ ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పాడు. ఆ తరవాత చిరంజీవి పెద్ద నటుడిగా ఎదిగితే తాను మాత్రం హోటల్ పనిచేశానని చెప్పాడు. తాను తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది గుంపుగా ఉన్నారని..ఏం జరుగుతుందా అని అక్కడకు వెళ్లి చూస్తే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పాడు.
Advertisement
దాంతో తాను చిరంజీవి కంటపడకుండా అక్కడ నుండి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్పాడు. కానీ తనను అప్పటికే చిరంజీవి చూసి ఏం చేస్తున్నావ్…ఎలా ఉన్నావ్ అంటూ బాగోగులు అడిగి తెసుకున్నాడని చెప్పారు. దాంతో తాను హోటల్ పనిచేస్తున్నా అని చెప్పడంతో చిరు షాక్ అయ్యారని….ఇంత గొప్పనటుడివి హోటల్ లో పనిచేస్తున్నావా నన్ను ఒకసారి కలువు అనిచెప్పాడని తెలిపారు.
కానీ తాను చిరంజీవిని కలవలేదని కొంతకాలం తరవాత బాలచందర్ గారి సినిమాలో అవకాశం వచ్చిందని ఆ తవరాత తాను సినిమాల్లో కొనసాగానని తెలిపారు. అంతే కాకుండా యాక్టింగ్ స్కూల్ లో ఉన్నప్పుడు అందరూ ఆంధ్రా హోటల్ లో భోజనం చేసేవారని కానీ తాను క్యారేజ్ తీసుకువెళ్లేవాడినని తెలిపారు. అప్పుడు చిరంజీవి చూసి నువ్వు కూడా మాతోనే తినాలి లేదంటే చంపేస్తాను అంటూ ప్రేమ చూపించారని అన్నారు.