Home » రెస్టారెంట్స్ ని పని చేసే చెఫ్ లు ఎందుకని పొడవాటి టోపీలు పెట్టుకుంటారు ?

రెస్టారెంట్స్ ని పని చేసే చెఫ్ లు ఎందుకని పొడవాటి టోపీలు పెట్టుకుంటారు ?

by Sravan Sunku
Ad

ఇటీవలి కాలంలో బిజీ లైఫ్ కారణంగా కొంతమందికి ఇంట్లో వండుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు. బయటి నుండి ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవడం, లేదా హోటల్స్ మరియు రెస్టారెంట్స్ వైపు పరుగులు పెడుతున్నారు. హెల్త్ కాన్షియస్ మరీ పెరిగిపోవడంతో పెద్ద పెద్ద హోటల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఇలా హోటల్స్, లేదా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వంట చేసేవాళ్లు తెల్లని టోపీలు ధరిస్తూ ఉంటారు. అయితే వారు ధరించే ఈ టోపీని ఏమంటారో తెలుసా.. వారు ధరించే ఈ తెల్లటి పొడవైన టోపీని (TOQUE) అంటారు. ఈ పదం అరబిక్ నుండి వచ్చింది.

Advertisement

అరబిక్ లో (TOQUE) అంటే.. టోపీ అని అర్థం. అయితే చెఫ్ లు టోపీలు ధరించే సాంస్కృతి ఫ్రాన్స్ లో మొదలైంది. వంట చేసే సమయంలో తల వెంట్రుకలు ఆ ఆహారంలో పడకుండా ఉండడం కోసం యూనిఫామ్ లో భాగంగా దీన్ని వేసుకుంటారు. అలాగే కిచెన్ లో చెఫ్ లు వేరువేరు సైజుల్లో టోపీలు ధరించడం చూస్తూ ఉంటాం. ఒక చెఫ్ ఎంత పొడవైన టోపీని ధరిస్తే.. అతడు అంత గొప్ప వంటగాడని అర్థం. ఇలా చెఫ్ లు టోపీని ధరించే సంప్రదాయం 1800 ల ప్రారంభంలో ఫ్రాన్స్ లో పురాణ చెఫ్ మేరీ – అంటోయిన్ కారెమ్ తన చెఫ్ లకు యూనిఫామ్ ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది ప్రారంభమైంది.

Advertisement

ఇక తెలుపు రంగును ఇష్టపడే రంగుగా ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది శుభ్రతను సూచిస్తుంది మరియు అతని వంటగది సిబ్బంది అందరూ వేరువేరు ర్యాంకులను సూచించే వివిధ ఎత్తులతో కూడిన టోపీ ధరించాలని రూల్ పెట్టారు. ఇక వైట్ కలర్ ఇచ్చే లుక్ మరే రంగు ఇవ్వలేదు. వైట్ డ్రెస్ కానీ, ఇంట్లో వైట్ ఇంటీరియర్ డిజైన్ కానీ సూపర్ లుక్ వస్తుంది. ఈ తెలుపు శాంతికి చిహ్నంగా చెప్తారని మనకు ఎలాగూ తెలిసిందే. చెఫ్ లు వైట్ యూనిఫామ్ లో ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్ గా వారిని చూస్తే మైండ్ కూల్ అవుతుంది. అలా కాకుండా ఇతర కలర్లలో ఉంటే మైండ్ గందరగోళంగా అవుతుంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading