Home » క్రీడాకారులు ఆట మధ్యలో అరటి పండునే ఎందుకు తింటారో తెలుసా ?

క్రీడాకారులు ఆట మధ్యలో అరటి పండునే ఎందుకు తింటారో తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ad

తక్కువ ధరలో లభించే… ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో అరటి పండు మొదటి స్థానంలో ఉంటుంది. డజన్ 40 నుండి 50 వరకు ఉండే ఈ పండ్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. అరటిపండులో పొటాషియం మరియు ఇతర పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్, ఫ్లోటెట్ , యాంటీ ఆక్సిడెంట్స్ లు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే క్రీడాకారులు ఎక్కువగా అరటి పండ్లను తింటూ కనిపిస్తారు.

Also Read: భార‌తీయ మ‌హిళ‌ల‌ను పెళ్లాడిన విదేశీ క్రికెట‌ర్లు వీరే..!

Advertisement

క్రికెట్ టెన్నిస్, ఫుట్ బాల్ ఇలా ఆట ఏదైనా క్రీడాకారులు అంతా బ్రేక్ సమయంలో ఎక్కువగా అరటి పండ్లు తినడం గమనిస్తుంటాం. అయితే అరటి పండ్లు తినడం వల్ల కేవలం ఎనర్జీ మాత్రమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా క్రీడలు అధిక శ్రమతో కూడుకున్నవి. ఫుట్ బాల్, క్రికెట్ లాంటి క్రీడల సమయంలో ఎక్కువగా పరుగెత్తాల్సి ఉంటుంది. అధిక శ్రమ కారణంగా బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. అయితే బ్లడ్ ప్రెజర్ పెరిగిన సమయంలో సోడియం స్థాయి అధికమై గుండె నొప్పికి దారితీసే అవకాశాలు కూడా ఉండొచ్చు.

Advertisement

అయితే ఆటగాళ్ళు అరటి పండు తినడం వల్ల అందులో ఉండే పొటాషియం సోడియం స్థాయిని నియంత్రిస్తూ గుండె నొప్పి వచ్చే ముప్పు నుండి నియంత్రిస్తుంది. అంతే కాకుండా అరటి పండ్లలో 75% నీరు ఉంటుంది. దాంతో ఆట సమయంలో వచ్చే దాహాన్ని కూడా ఇది తీర్చుతుంది. ఇక ఆట సమయంలో ఎక్కువ ఆకలి అవ్వడాన్ని కూడా అరటిపండు తినడం వల్ల నియంత్రించవచ్చు. అందువల్లే క్రీడాకారులు ఆట సమయంలో ఎక్కువగా అరటి పండ్లను తింటూ ఉంటారు. ఇంతటి ప్రయోజనాలు కలిగించే అరటి పండును ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రతిరోజు తినడం వల్ల ఎవరైనా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: అమ్మాయిల కొర‌త‌… పెళ్లిళ్ల కోసం ప‌క్క రాష్ట్రాల‌కు! వెయిటింగ్ లో 40,000 మంది యువ‌కులు!

Visitors Are Also Reading