అటల్ బిహారీ వాజ్‌పేయి తన ధృడ సంకల్పం వలనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అతని తల్లిదండ్రులు తన కోసం మ్యాచ్ కోసం చూస్తున్నారని తెలుసుకున్నప్పుడు మూడు రోజుల పాటు స్నేహితుడి ఇంట్లో తాళం వేసుకుని అక్కడే ఉండిపోయారట. ఈ విషయాన్నీ ఆయన స్నేహితుడు దివంగత గోరే లాల్ త్రిపాఠి తెలిపారు. 1940ల మధ్యకాలంలో, వాజ్‌పేయి కాన్పూర్‌లోని DAV కాలేజీలో PG విద్యార్థిగా ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు తన పెళ్లిని ప్లాన్ చేసారు. డై నుంచి తప్పించుకోవడానికి పతారా బ్లాక్‌లోని రాయ్‌పూర్ గ్రామంలోని త్రిపాఠి ఇంటికి పారిపోయారట.
అసలు ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆయన జీవితంలో రాజ్ కుమారి కౌల్ కు ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ లో చదివేటప్పుడు అటల్ బిహారి రాజ్‌కుమారి హక్షర్ కౌల్ ని చూసి అట్ట్రాక్ట్ అయ్యారట. విక్టోరియా కాలేజీలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారట. వారిలో రాజ్ కుమారి కౌల్ చాలా అందంగా ఉండేవారట. కౌల్, వాజపేయి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు.
Advertisement
Advertisement
కౌల్ బ్రదర్ హక్షర్ వాజ్ పేయికి పరిచయం అయ్యారు. ఆ తరువాతే వాజ్ పేయి కౌల్ ని కలిశారు. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కౌల్ కుటుంబం ఒప్పుకోలేదు. కౌల్ ను ఆమె పేరెంట్స్ ఢిల్లీ లో రామ్‌జస్ కాలేజీ లో ఫిలాసఫీ ని బోధించే బ్రజ్ నారాయణ్ కౌల్ కు ఇచ్చి పెళ్లి చేసారు. వాజ్ పేయితో తనకు ఉన్న బంధాన్ని కౌల్ ఓపెన్ గానే చెప్పారట. ఓ సారి వాజ్ పేయి కౌల్ కు లైబ్రరీ పుస్తకంలో లేఖ రాసి పెట్టారట. ఆ లేఖని కౌల్ చదివారు. దానికి సమాధానం కూడా కౌల్ తిరిగి పంపారట. కానీ, ఆ లేఖ వాజపేయికి చేరలేదు. అందుకే ఆయనకు తెలియలేదు. 1980ల్లో సావి మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు ఒప్పుకున్నారట. వాజ్ పేయికి నాతొ పాటు నా భర్తతో కూడా మంచి రిలేషన్ ఉంది. అందుకే మా మధ్య ఉన్న బంధం గురించి నా భర్తకి వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదని కౌల్ తెలిపారు. వాజ్ పేయికి అత్యంత సన్నిహితుడైన అప్పా ఘటాటే కు వీరిద్దరి మధ్య బంధాన్ని స్నేహం అనాలో లేక ప్రేమ అనాలో తెలియదన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!