Home » గూస్ బంప్స్ ఎలా వ‌స్తాయి..ఎందుకు వ‌స్తాయో తెలుసా..?

గూస్ బంప్స్ ఎలా వ‌స్తాయి..ఎందుకు వ‌స్తాయో తెలుసా..?

by AJAY
Ad

ఏదైనా సినిమాలో ఆశ్చ‌ర్యం క‌లిగించే స‌న్నేవేశాన్ని చూసినా లేదంటూ బ‌య‌ట ఎక్క‌డైనా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు చూసినా గూస్ బంప్స్ వ‌చ్చాయ‌ని చెబుతుంటారు. గూస్ బంప్స్ అంటే రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం. ప్ర‌స్తుతం ఈ గూస్ బంప్స్ అనే ప‌దాన్ని ఎక్కువ‌గా వాడుతున్నారు. అది చూస్తే గూస్ బంప్స్ వ‌చ్చాయి రా..

Advertisement

అలా చేస్తే గూస్ బంప్స్ వ‌చ్చాయి రా..ఇలా ర‌క‌ర‌కాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే గూస్ బంప్స్ ఎలా వస్తాయి అన్న‌ది మాత్రం చాలా మందికి తెలియదు. కాబ‌ట్టి అస‌లు గూస్ బంప్స్ ఎందుకు వ‌స్తాయి…ఎలా వ‌స్తాయి అన్న‌ది ఇప్పుడు చూద్దాం….గూస్ బంప్స్ నే గూస్ ఫ్లెష్‌, గూస్ పింపుల్స్, చిల్లీ బంప్స్ అని కూడా అంటారు.

Advertisement

goose bumps

goose bumps

కోడి, బాతు లాంటి ప‌క్షుల‌కు ఈక‌లు ఉంటాయి. అయితే ఆ ఈక‌ల‌ను పీకేస్తే నిక్క‌బొడుచుకుని ఉండే స‌న్న‌ని నిర్మాణాలు క‌నిపిస్తాయి. అయితే వాటిని గూస్ బంప్స్ అని అంటారు. మ‌నుషుల‌కు రోమాలు నిక్క‌బొడుచుకున్నా కూడా కోళ్లు బాతుల‌కు ఈక‌లు పీకిన‌ట్టుగానే ఉంటాయి కాబ‌ట్టి వాటిని కూడా అదే పేరుతో పిలుస్తూ వ‌చ్చారు. అలా రోమాలు నిక్క‌డబొడుచుకోవ‌డంను గూస్ బంప్స్ గానే ఫిక్స్ అయ్యింది. కానీ సైన్స్ భాష‌లో గూస్ బంప్స్ ను ఫిలో మోటార్ రిఫ్లెక్స్ అని అంటారు. చ‌ర్మంమీద ఉండే ప్ర‌తి వెంట్రుకకు ఎర‌క్ట‌ర్ పిలి అనే ఒక కండ‌రం ఉంటుంది.

ఈ కండ‌రాలు సంకోచించిన‌ప్పుడు అక్క‌డ చ‌ర్మం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి వెంట్రుక‌లు పైకి లేస్తాయి. మ‌ళ్లీ ఈ కండ‌రాలు వ్యాకోచించిన్పుడు వెంట్రుక‌లు కింద‌కు వ‌స్తాయి. భ‌య‌ప‌డినప్పుడు….లేదంటే ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు మ‌న మూత్ర పిండాల పై ఉండే ఎడ్రిన‌ల్ గ్రంధులు ఎడ్రిన‌ల్ ను విడుద‌ల చేస్తాయి. అది ర‌క్తంలో క‌లిసి ఎర‌క్ట‌ర్ పిలి అనే కండ‌రాలు సంకోచిస్తాయి. అలా గూస్ బంప్స్ అనేవి వ‌స్తాయి. ఇక మ‌నుషుల‌కే కాకుండా జంతువుల‌కు కూడా అవి భ‌య‌ప‌డిన‌ప్పుడు గూస్ బంప్స్ వ‌స్తుంటాయి.

also read : కొత్త వాహ‌నాల‌తో నిమ్మ‌కాయాల‌ను ఎందుకు తొక్కిస్తారో తెలుసా?

Visitors Are Also Reading