సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లను పెళ్లి చేసుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక పెళ్లి చేసుకున్న తరవాత కలిసి ఉన్న సెలబ్రెటీ జంటలను అయితే వేళ్ల పై లెక్క పెట్టొచ్చు. అలాంటి లిస్ట్ లో నాగార్జున అమల కూడా ఒకరు. అమల ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించారు. ఇక నాగార్జున తో సినిమా చేస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలో పడి ఆయననే వివాహం చేసుకున్నారు.
ALSO READ : పాన్ ఇండియాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టబోతున్న చరణ్ బన్నీ…చివరికి గెలిచేదెవరు..?
Advertisement
ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబాన్ని చూసుకోవడంతో పాటూ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిచే ప్రశంసలు అందుకున్నారు. జంతు ప్రేమికులరాలిగా ఆమె ఎంతో పేరు సంపాదించుకున్నారు. అయితే అమల గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం….అమల నాగార్జున సతీమణి అంతే కాకుండా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.
Advertisement
అయితే వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఆమె మెడలో తులం బంగారం కూడా కనిపించదు. అంతే కాకుండా కేవలం ఆమె మెడలో ఒక నల్ల పూసల తాడు మాత్రమే కనిపిస్తుంది. కాగా అమల బంగారం వేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అమలకు ఓ ఆరోగ్య సమస్య ఉందట.
అదే స్కిన్ ఎలర్జీ…బంగారం మెడలో వేసుకుంటే లేదా చేతులకు ధరించినా కూడా రాషెస్ వస్తాయట. చర్మం అంతా ఎరుపుగా మారిపోతుందట. అందువల్లనే అమల అసలు బంగారం వేసుకోకుండా చాలా సింపుల్ గా కనిపిస్తారట. ఇక అమలకు ఇలాంటి వ్యాధి ఉందని నెట్టింట వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులను ఎంతో బాధపడుతున్నారు.