వన్డే వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతుంది. అక్టోబర్ నుండి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో ఎవరు సెలెక్ట్ అవుతారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనర్లు ఎవరు? మిడిలార్డర్లు ఎవరు? బౌలర్లు ఎవరు? అని చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు మరో చర్చ ఇప్పుడు వికెట్ కీపర్ గురించి జరుగుతుంది. రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదు. దాంతో అతను వరల్డ్ కప్ రేస్ లో లేడు. అందుకే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరు అనేది పెద్ద ప్రశ్న? జట్టులో కీపర్ పాత్ర చాలా ముఖ్యమైనది.
Advertisement
కెప్టెన్ తర్వాత జట్టును ఆ స్థాయిలో ప్రభావితం చేసేది కీపరే. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముగ్గురు ఆటగాళ్లు కీపింగ్ లో ఉన్నారు. సంజు శాంసన్, రాహుల్ గతంలో పంత్ లేని సమయంలో రాహుల్ వికెట్ కీపర్ గా చేశాడు. కానీ ఐపీఎల్లో గాయపడిన రాహుల్ 8 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడలేదు. ఈ సమయంలో అతన్ని వరల్డ్ కప్ లో కీపర్ గా సెలెక్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. వెస్టిండీస్ పర్యటనలో వన్డేలకు ఇషాన్ కిషన్, టి20 సంజు శాంసన్ కీపర్ గా తీసుకున్నారు. వన్డేల్లో బ్యాటింగ్ లో కిషన్ రాణించాడు. కానీ టి20 లో సంజు విఫలమయ్యాడు. కీపర్ గా జట్టుకు బలంగా ఉంటూనే బ్యాటింగ్ లో సత్తా చాటాలి. అందులో ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనేది తేల్చే పనిలో బీసీసీఐ పడింది.
Advertisement
కేఎల్ రాహుల్ ను ఆసియాకప్ ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్ లో సెలెక్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక సంజు శాంసన్ కు ఐర్లాండ్ టూర్ లో ఆడే ఛాన్స్ ఉంది. మరి ఈ సిరీస్ లో ఎవరు రాణిస్తారు? వారిని వన్డే వరల్డ్ కప్ లో కీపర్ కోటాలో ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, శాంసన్ ఇద్దరూ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే ఆటగాళ్లు. ధనాధన్ బ్యాటింగ్ తో పాటు అవలీలగా బంతిని స్టాండ్స్ లోకి పంపడంలో సిద్ధహాస్తులు. ఇద్దరూ వన్డేలో రికార్డులను తిరగరాస్తే ఇప్పటివరకు ఇషాన్ కిషన్ 16 వన్డేలు ఆడాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 46.26 సగటుతో 694 పరుగులు చేశాడు. మరోవైపు 13 వన్డేలు ఆడిన సంజు శాంసన్ 55.71సగటుతో 390 రన్స్ చేశాడు. వరల్డ్ కప్ లో పరుగులు సాధించగల వికెట్ కీపర్ కోసం సెలెక్టర్లు చూస్తున్నారు. గతంలో 5వ స్థానంలో రాణించిన రాహుల్ కు వికెట్ కీపర్ అనుభవం ఉంది. దాంతో అతడు జట్టులో ఉండడం ఖాయం అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
Mr Pregnant Review : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ..హిట్ కొట్టినట్టేనా ?
Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?