దేశంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకూ హిందీలో ఏకంగా 14సీజన్లు పూర్తయ్యింది. అంతే కాకుండా తెలుగు తమిళ భాషల్లో 5వ సీజన్ రన్ అవుతోంది. ఇక అంతటి క్రేజ్ ఉన్న బిగ్ బాస్ ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది సభ్యులు మాత్రం బిగ్ బాస్ నుండి బయటపడేందుకు నానా కష్టాలు పడ్డారు. అంటే ఎలిమినేస్ అయ్యి భయటపడటం కాదు. గోడలు దూకి భయటపడటం. ఇక అలా హిందీలో ప్రతి సీజన్ లోనూ ఒకరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మనకు చూపించరు కానీ తెలుగు తమిళ బిగ్ బాస్ లోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అలా బిగ్ బాస్ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించిన కంటెస్టెంట్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో భరణి అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ నుండి తప్పించుకే ప్రయత్నం చేశాడు. కానీ బిగ్ బాస్ లోపలికి పిలిచి అతడిని ఇంట్లో ఉండేందుకు ఒప్పించాడు.
Advertisement
తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో హీరో సంపూర్ణేష్ బాబు పారిపోయేందుకు ప్రయత్నించాడు. హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. దాంతో చివరకు బిగ్ బాస్ కే చిరాకు వచ్చి అతడు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అతి కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయడంతో సంపూర్ణేష్ బాబు బయటకు వచ్చాడు. లేదంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం మధ్యలో వెళ్లిపోవాలంటే పెనాల్టీ కట్టాలి.
Advertisement
బిగ్ బాస్ సీజన్ 4 లో గంగవ్వ హౌస్ లో ఉండలేను అంటూ ఏడ్చేసింది. అనేకసార్లు తన ఆరోగ్యం భాగుడటం లేదని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేసింది. ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు చివరికి ఇంటికి పంపిచారు.
హిందీ బిగ్ బాస్ 2 లో రాహుల్ మహజన్ అనే కంటెస్టెంట్ డోర్ బద్దలు కొట్టి మరీ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడితో పాటు మరో నలుగురు కంటెస్టెంట్ లను తీసుకెళ్లాడు. డోర్ నుండి భయట అడుగు పెట్టగానే బిగ్ బాస్ ఇంట్లోకి పిలిచి తాను పోవడమే కాకుండా మరో ముగ్గురిని పోయేందుకు ఎంకరేజ్ చేసిన రాహుల్ మహాజన్ ను షో నుండి వెళ్లిపోమన్నాడు.
హిందీ బిగ్ బాస్ సీజన్ 11 లో వికాస్ అనే కంటెస్టెంట్ కు వారం రోజులపాటు జైలు శిక్ష విధించడంతో అతడు జైలు కిటికీలో నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ బిగ్ బాస్ అతన్ని కూచ్చోబెట్టి మాట్లాడి ఒప్పించాడు.
హిందీ బిగ్ బాస్ సీజన్ 12 లో మన క్రికెటర్ శ్రీశాంత్ చాలా సార్లు పారిపోయేందుకు ప్రయత్నించాడు. శ్రీశాంత్ ఎవరితో గొడవ అయినా ఇంట్లో నుండి పారిపోయేందుకు ప్రయత్నించేవాడు.