కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. ఆఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో పలు దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలు అన్నీ బూస్టర్ డోసు ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే వ్యాక్సిన్ మూడు డోస్ లు పూర్తి చేసుకుని నాలుగవ డోస్ లను ఇస్తోంది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయిల్ బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ డోస్ లపై కీలక వ్యాఖ్యలు చేసింది. బూస్టర్ డోస్ లతో కరోనా విపత్తు నుండి బయటపడలేరు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్ ఇప్పటికే ప్రపంచంలోని 160 దేశాలలో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. కొన్ని సంపన్న దేశాలు అదనపు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపించామని చెప్పడం సమంజసం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. ఇది అసమానతలను తీవ్రతరం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి అధనామ్ ఘోబ్రేయేసస్ అన్నారు. అదనపు డోసులు కరోనా మహమ్మారిని అంతం చేయకపోవడంతో పాటు ఇప్పటికే అధిక స్థాయిలో టీకాలు పంపిన దేశాలకు మళ్లీ వ్యాక్సిన్ సరఫరాను మల్లిస్తున్నయని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఈ కారణంగా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉందని వెల్లడించారు. కరోనా నుండి బయట పడటానికి ఏ దేశం కూడా దారి చూపలేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని పేద దేశాల్లో చాలా మంది బలహీన ప్రజలు ఇప్పటివరకు ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని…. కానీ సంపన్న దేశాలు మాత్రం పెద్ద ఎత్తున బూస్టర్ డోస్ లు అంటూ హడావిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని 106 దేశాలలో ఈ వేరియంట్ ను గుర్తించామని తెలిపారు. క్రిస్మస్ పండగ సెలవులలో ఆంక్షలను విధించి కరోనాను అరికట్టాలని డ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.