Home » బేబీ సినిమా కథ చెప్పడానికి వెళితే.. డైరెక్టర్ సాయి రాజేష్ ని అవమానించిన హీరో ఎవరు..?

బేబీ సినిమా కథ చెప్పడానికి వెళితే.. డైరెక్టర్ సాయి రాజేష్ ని అవమానించిన హీరో ఎవరు..?

by Mounika
Ad

ఒక డైరెక్టర్ గాని, రచయితగాని తాము తీయబోయే సినిమాలో ఈ హీరో అయితే బాగుంటుందని  ఊహించుకుంటూ కథను అల్లుకుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాము ఊహించుకున్న హీరో కాకుండా మరొకరితో సినిమా తీయవలసి వస్తుంది. ఇలాంటి సిచువేషన్ ఎంతోమంది డైరెక్టర్లకు ఎదురయ్యే ఉంటుంది. ఇటీవల బేబీ చిత్రంతో సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన ముందుగా బేబీ చిత్రానికి ఒకరిని హీరోగా నిర్ణయించుకోవడం జరిగిందట. ఈ సినిమాకి అతను డైరెక్టర్ అయితే కథ కూడా వినని సాయి రాజేష్ ని అవమానించాడట ఓ హీరో.

Advertisement

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రలో నటించిన బేబీ చిత్రం ఈ జులై 14న విడుదలై సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుంది . ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి గాను చిత్ర యూనిట్ తో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన విజయ్ దేవరకొండ అల్లు అరవింద్, నాగబాబు, మైత్రీ మూవీ మేకర్స్ వై రవి శంకర్ పాల్గొని సినిమా సక్సెస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సెలబ్రేషన్స్లో సాయి రాజేష్ ఈ సినిమా విషయంలో ఓ హీరో కలవడానికి వెళితే.. అతనే ఈ సినిమాకి డైరెక్టర్ అయితే.. అసలు ఆ కథే నేను వినను అంటూ ఆ హీరో  సాయి రాజేష్ ని అవమానించిన విషయాన్ని బయటపెట్టారు.

Advertisement

ఆనంద్‌కు కథ చెప్పడానికి వెళ్తే నన్ను ప్రోత్సహించింది విజయ్‌గారే. నా సినిమాలో ఆనంద్ ని తప్ప మరో హీరోను ఊహించుకోలేదు. అతను ఈ సినిమాకు ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు.  ఈ పాత్రకు 100% న్యాయం చేశాడు ఆనంద్. ఇక మా హీరోయిన్ వైష్ణవి మంచి జాబ్ చేస్తూ అవన్నీ వదులుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడి మరీ ఈ సినిమా చేసింది. విరాజ్ కూడా ఈగో లేకుండా ఈ సినిమా చేశాడు. అతను ఎవరికి పేరొస్తుందని ఆలోచించలేదు. మంచి సినిమా చేస్తున్నామని మమ్మల్ని నమ్మాడు అంటూ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఒక హీరోకు ఈ కథ చెబుదామనుకుంటే.. ఆ డైరెక్టర్ అయితే కథ కూడా వినే ప్రసక్తే లేదు అన్నాడు. అలాంటి టైమ్‌లో ఈ ముగ్గురు నన్ను నమ్మి డైరెక్టటర్ గా ఓ మంచి సినిమాకు అవకాశం కల్పించారు. ఎస్.కె.ఎన్ నా ఫ్రెండ్ అవడం నిజంగా నా అదృష్టం గా భావిస్తున్నాను. నన్ను నమ్మి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మా నిర్మాత. ఇక డైరెక్టర్ మారుతి‌గారికి ఈ సినిమా మీద అందరి కంటే ఈ ఎక్కువగా నమ్మకం ఉండేది. ఇలాంటి మంచి సినిమాలే ఫ్యూచర్‌లోనూ చేస్తానని మాటిస్తున్నాను అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్స్ సైతం ఇంత మంచి సినిమాను వదులుకున్న ఆ హీరో ఎవరై ఉంటారబ్బా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఈసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే స్టార్ కపుల్ ఎవరో తెలుసా…?

Rx 100 మూవీలో హీరోయిన్ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా..?

Mahesh: మహేష్ బాబు నటించిన ఆ సూపర్ హిట్ సినిమా సూపర్ స్టార్ కృష్ణ సినిమాకి కాపీనా? ఈ విషయం తెలుసా?

 

 

Visitors Are Also Reading