సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రెస్ మీట్ లలో పలికిన పేరు రాహుల్. అప్పట్లో వరుసగా కేసీఆర్ తన ప్రెస్ మీట్ లలో రాహుల్ పేరును ప్రస్తావించారు. అంతే కాకుండా తాజాగా నిన్న నేడు కూడా కేసీఆర్ తన మీడియా సమావేశంలో రాహుల్ పేరును ప్రస్తావించారు. ఇక అలా కేసీఆర్ పదే పదే తన మీడియా సమావేశంలో రాహుల్ అట్ల కాదయ్యా….అంటూ పేరును ఉచ్చరిస్తూ పలకడం వల్ల ఆయన పేరు తెగ పాపులర్ అయ్యింది. ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అసలు రాహుల్ ఎవరు ఆయన ఎక్కడ పనిచేస్తారు..పదే పదే రాహుల్ అనే పేరును సీఎం పలుకుతున్నారంటే అంత స్పెషల్ ఏంటని అంతా అనుకుంటున్నారు.
Advertisement
Advertisement
ఆ రాహుల్ ఎవరు…ఆయన ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..జర్నలిస్ట్ రాహుల్ సీనియర్ జర్నలిస్ట్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈయన ప్రింట్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తంపును సంపాదించికున్నారు. గతంలో సీఎం వైఎస్ రాజశేకర్ రెడ్డి ఈయనకు ఎంతగానో సన్నిహితంగా ఉండేవారట. వైఎస్ ఎంతో క్లోజ్ గా ఉన్నా కూడా జర్నలిస్ట్ రాహుల్ ఆయనను ఏ చిన్న సాయం కూడా చేయాలని కోరలేదట.
అంతే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జర్నలిస్ట్ రాహుల్ క్లాస్ మేట్ అంట. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లోని ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారట. ఇక వీళ్లు మాత్రమే కాకుండా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు కూడా జర్నలిస్ట్ రాహుల్ తో సన్నిహితంగా ఉండేవారట. పాత్రికేయులు రాహుల్ అందరితో కలివిడిగా ఉండటం వల్లే ఆయనను చాలా మంది అభిమానిస్తూ పేరు పెట్టి పిలుస్తారంట.