అమ్మ అనే రెండు అక్షరాలు లోనే ఎన్నో ప్రేమానురాగాలు దాగి ఉంటాయి. తల్లి ప్రేమ అది పక్షుల్లో అయినా, జంతువుల్లో అయినా, మనుషుల్లో ఆయన సమస్త జీవరాసులలో ఎక్కడైనా సరే తల్లి ప్రేమకు హద్దులు అనేవి ఉండవు. తన ఊపిరి ఉన్నంతవరకు తను కన్న బిడ్డల కోసం పరితపిస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి పై చదువులు చదివించి, కష్టపడిన తల్లిదండ్రులను చాలా మంది కొడుకులు, బిడ్డలు కనీసం కంట చూడడం లేదు. చివరికి అనాదల్లా రోడ్ల మీద పడి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది మనకు తారస పడుతూనే ఉంటారు.
Advertisement
అలాంటి వారు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, మిమ్మల్ని ఏ విధంగా పెంచిందో, ఓసారి గుర్తు చేసుకోండి. ప్రస్తుత కాలంలో ఆడతల్లి పెళ్లి చేసుకున్నప్పటినుంచి తన భర్తకు సేవ చేస్తూ, పిల్లలను కన్న తర్వాత పిల్లలకు సేవ చేస్తూ, జాబ్ చేసే వారైతే ఇవన్నీ ముగించుకుని మళ్లీ జాబు చేసి సాయంత్రం వేళ మళ్లీ పిల్లలకు, భర్తకు ఆహారాన్ని వండి పెట్టి పిల్లలు తింటుంటే ఆనందపడే తల్లిదండ్రులు ఎంతో మంది. మరికొంత మంది పేద తల్లులు అయితే తమ పిల్లలను చిన్నతనం నుంచి చదివిస్తూ, వారికి మంచి ర్యాంకులు వస్తే ఆనంద పడుతూ కూలి పనులకు వెళ్తుంటారు.
Advertisement
Beyond Caption. pic.twitter.com/xlhU9uJTsx
— Ankita Sharma (@ankidurg) June 9, 2022
కష్టపడి చదివిన బిడ్డ ఏదైనా సాధిస్తే ఆ పేద తల్లిదండ్రులకు దాన్ని మించిన ఆనందం ఏది ఉండదు.ఒక తల్లి తన బిడ్డను సైకిల్ పై కూర్చోబెట్టుకుని, బిడ్డ కింద పడకుండా దానిపై కుర్చీని కట్టి ఆనందంగా సైకిల్ తొక్కుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ బిడ్డ సైకిల్ పై కూర్చుని అటూ ఇటూ ఆనందంగా చూస్తుంటే, ఆ తల్లి సైకిల్ తొక్కుకుంటూ ముందుకు కదులుతోంది. అయితే ఈ వీడియోను ఐపీఎస్ అంకితశర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి “బై హ్యాండ్ క్యాప్షన్ “అని రాసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. తల్లి ప్రేమపై ఎంతోమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
also read;
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాయిధరమ్ తేజ్ ..! అసలేమయ్యిందంటే…?
ఉత్తర కొరియాలో అంతు చిక్కని కొత్త వ్యాధి.. భయాందోళనలో హోజూ నగరవాసులు..!