నందమూరి బాలయ్య వారసురాలు బ్రాహ్మణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈమె తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి గానే కాకుండా బిజినెస్ ఉమన్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బ్రాహ్మణి సినిమా మరియు రాజకీయ రెండు రంగాలలోకి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అటు సినిమా రంగంలోకి ఇటు రాజకీయ రంగంలోకి ప్రవేశించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని బిజినెస్ ఉమన్ గా హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ గా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది బ్రాహ్మణి.
బ్రాహ్మణి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టకపోయినా ఆమెకు హీరోయిన్ రేంజిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఇటీవల బ్రాహ్మణికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి బ్రాహ్మణికి ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టము అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంతకీ బ్రాహ్మణికి ఇష్టమైన ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రాహ్మణి చిన్నతనం నుంచి తన తండ్రి బాలయ్య సినిమాలు ఎక్కువగా చూసేవారట. తండ్రి కన్నా తాతయ్య ఎన్టీఆర్ సినిమాలంటేనే బ్రాహ్మణునికి ఇంకా ఎక్కువ ఇష్టమట. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు అంటే ఆమెకు అంతగా ఇష్టం ఉండేవి కాదట. అంతే కాకుండా తన ఫేవరెట్ హీరో కూడా తన తాతయ్య ఎన్టీఆర్ గారే అంటూ ఆమె పలు సందర్భాలలో కూడా తెలిపారు. ఇక తాతయ్య, తండ్రి ఇద్దరు తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి బ్రాహ్మణి వారిని హీరోలుగా ఇష్టపడడం అనేది సర్వసాధారణం.
ఇక వీరిద్దరి తర్వాత బ్రాహ్మణి ఇష్టమైన మరో హీరో ఉన్నారట. అయితే ఈయన మాత్రం ఆమె కుటుంబానికి చెందినవారు కాదు. ఇంతకీ బ్రాహ్మణికి అంతగా ఇష్టమైన హీరో ఎవరు అనే విషయానికి వస్తే.. ఆయన ఇంకెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. బ్రాహ్మణికి చిరంజీవి నటన అంటే చాలా ఇష్టమని తెలియడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
కల్కి టీజర్ మొత్తం కమల్ హాసన్నే ఉన్నాడంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..! ఇంతకీ ఎక్కడా..?
మహేష్ ‘అతిథి’లో చేసిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?
చందమామ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం గురూ..!