అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆలస్యంగా అడుగు పెట్టినా ఓ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తమ రికార్డులతో ఇప్పటికీ గుర్తుండిపోయారు. క్రికెట్ ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఆ ముగ్గురు ఆటగాళ్లను ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మైకేల్ హస్సీ :
మైకేల్ హస్సీ మిస్టర్ క్రికెట్ బిరుదును సంపాదించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసేందుకు దాదాపు పదేళ్ల పాటు హస్సీ కష్టపడ్డారు. తనకు 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వన్డేలలో.. 38 ఏళ్ల వయసు ఉన్నప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్ట్ క్రికెట్ లో రెండేళ్ల తర్వాత అతని సగటు 86.18 కి పెరిగింది. అంతే కాకుండా హస్సీ అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసి రికార్డు సాధించాడు. 164 రోజుల్లోనే హస్సీ ఈ ఘనతను సాధించాడు. మరోవైపు 2006లో ఐసిసి ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కూడా గెలుచుకున్నాడు. అంతేకాకుండా 2010 టి20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వరకు ప్రతి ఫార్మాట్ లోనూ భాగా రాణించగలడు అని నిరూపించుకున్నాడు. కేవలం 24 బంతుల్లో 60 పరుగులు కొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.
సయూద్ అజ్మల్
Advertisement
పాకిస్థాన్ ఆటగాడు అజ్మల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆలస్యంగా అరంగేట్రం చేశాడు. 32 ఏళ్ల వయసులో సయీద్ తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత తన అద్భుతమైన ప్రదర్శన చూపించి అత్యుత్తమ స్పిన్నర్ల లో ఒకడిగా నిలిచాడు. సయీద్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకునే వాడు… అంతేకాకుండా అందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెండో బౌలర్ గా సయీద్ రాణించారు. రికార్డులతో పాటు ఈ తన బౌలింగ్ కారణంగా వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అంతేకాకుండా సయీద్ నిషేధాన్ని సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డేలో సయీద్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. ఇక సయీద్ కెరీర్ ఎక్కువ కాలం మాత్రం సాగలేదు. తక్కువ కాలంలో ఎక్కువ రికార్డులు నెలకొల్పి నెంబర్ వన్ ర్యాంకింగ్ లోకి చేరుకున్నాడు.
ఆడమ్ ఓజెస్
ఆడమ్ ఓజెస్ ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు. ఆడమ్ కూడా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆలస్యంగానే అరంగేట్రం చేశాడు. 28 సంవత్సరాల వయస్సులో వన్డే మరియు టి20 క్రికెట్ ఆడటం కోసం ఆడుతూ కెరీర్ ను ప్రారంభించాడు. 38 ఏళ్ళ వయసులో టెస్టు చరిత్రలో అరంగేట్రం చేసి మ్యాచ్ లో సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. వెస్టిండీస్ 130 పరుగులతో ఇన్నింగ్స్ రికార్డు సృష్టించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా 11లో సాధారణ సభ్యుడయ్యాడు. అదేవిధంగా బంగ్లాదేశ్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ గాయపడతంతో అతడి స్థానంలో ఆడమ్ మోజస్ కు బాధ్యతలు అప్పగించారు.
Also read :పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..!