సాధారణంగా చాలామంది వారి యొక్క చేతి గోళ్లను పరిశీలించినప్పుడు తెల్లని మచ్చలు అడ్డగీతలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ గీతలు ఎందుకు కనిపిస్తాయి అనేది చాలామందికి తెలియదు. కొంతమంది క్యాల్షియం లోపం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడతాయని అనుకుంటారు.. కానీ ఇది నిజం కాదు. గొల్లపై మచ్చలు ఏర్పడడానికి కారణం జింకు లోపం. కాబట్టి ఆహారంలో జింక్ ఉన్న ఆహార పదార్థాలు తినాలని వైద్య నిపుణులు అంటున్నారు..
Advertisement
also read:తమిళ స్టార్ హీరో కి జోడిగా ఐశ్వర్య.. 22 ఏళ్ల తర్వాత..!
Advertisement
జింకు లోపాన్ని ఈజీగా తీసుకోవద్దని , ఈ లోపం వల్ల గుండె, ఊపిరితిత్తులు, ఎముకల్లో సమస్యలు ఏర్పడవచ్చునని అంటున్నారు. అలా అని జింకు అధిక మోతాదులో కూడా శరీరంలో నిలిపి ఉంచుకోలేదు. ఎక్కువ జింకు శరీరంలోకి వెళ్తే అది మూత్రం రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి జింకు ఏ మొతాదు లో తీసుకోవాలో అంతే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మన శరీరానికి ఐరన్ ఏ విధంగా అవసరమో జింకు కూడా అత్యవసరమైంది. డిఎన్ఏ,కణాల వృద్ధి వంటి వాటికి జింక్ చాలా అవసరం.
అందుకే దీన్ని మిరాకిల్ మినరల్ గా పిలుస్తారు. ఇది చాలా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని వైద్యులు అంటున్నారు. మన దేశంలో 73 శాతం మంది ప్రజల్లో జింకు లోపం ఉందని అంటున్నారు.. ఈ జింకు లోపం రాకుండా ఉండాలి అంటే పాలకూర,బ్రొకోలీ, గుమ్మడి గింజలు, నట్స్, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, చికెన్,మటన్, పీతల్లో ఈ జింకు ఎక్కువగా లభిస్తుంది.
also read:హైపర్ ఆదికి జారు మిఠాయి తినిపిస్తా అంటూ శ్రీరెడ్డి ఫైర్…వీడియో వైరల్….!