Home » హైపర్ ఆదికి జారు మిఠాయి తినిపిస్తా అంటూ శ్రీరెడ్డి ఫైర్…వీడియో వైరల్….!

హైపర్ ఆదికి జారు మిఠాయి తినిపిస్తా అంటూ శ్రీరెడ్డి ఫైర్…వీడియో వైరల్….!

by AJAY
Ad

జబర్దస్త్ కంటెస్టెంట్ గా పరిచయమై టీం లీడర్ గా ఎదిగిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ప్రస్తుతం హైపర్ ఆది సినిమాలలోనూ నటిస్తున్నాడు. అయితే ముందు నుండి హైపర్ ఆది తాను పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ చెప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ లో అనేక సందర్భాల్లో పవన్ పై హైపర్ ఆది ప్రశంసలు కురిపించాడు.

Advertisement

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలోను హైపర్ ఆది నటించాడు. ఇక కేవలం హైపర్ ఆది సినిమాల్లో నటించడమే కాకుండా రాజకీయాల్లోనూ చురుకుగానే వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి హైపర్ ఆది సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా హైపర్ ఆది జనసేన యువశక్తి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది పవన్ పై ప్రశంసలు కురిపించాడు. హైపర్ ఆది మాట్లాడుతూ ….150 మంది ఎమ్మెల్యేలు ఒకరికి భయపడుతున్నారు అంటే తన పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు.

Advertisement

అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా మందుకు బిర్యానీకు రాలేదని…. కేవలం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చారని చెప్పాడు. కౌలు రైతుల కష్టాల కోసం సినిమాలను ఒప్పుకుంటే తప్పా…,? మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేయవచ్చా అంటూ ఆంధ్ర ప్రదేశ్ మంత్రులను ప్రశ్నించాడు. దాంతో హైపర్ ఆది పూర్తిగా జనసేన వ్యక్తి అని క్లారిటీ వచ్చేసింది. అయితే హైపర్ ఆది జనశక్తి సభలో పాల్గొనడంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ హైపర్ ఆది పై ఫైర్ అయ్యింది. హైపర్ ఆది జంబలకడి గాడు వాడికి జారు మిఠాయి ఇస్తానని చెప్పింది. డైపర్ ఆది గాడు మళ్లీ లైన్ లోకి వచ్చాడని కామెంట్ చేసింది.

పవన్ కళ్యాణ్ హీనస్థితికి జారిపోయాడని… ఎవరితో పబ్లిసిటీ చేయించుకోవాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. జబర్దస్త్ లో చీప్ కామెడీ చేసుకునే ఎదవని తీసుకువచ్చి చీఫ్ పబ్లిసిటీ చేయించుకున్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలను ఎంతకు దిగజార్చాడో తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించింది. మొన్న హైపర్ ఆది మంత్రి రోజా తో కలిసి వైసిపి సభలో కనిపించాడని… ఇప్పుడు జనసేన సభలో కనిపించాడని విమర్శించింది. డబ్బులు ఇస్తే ఏ స్టేజ్ అయినా ఎక్కి మాట్లాడతాడని శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది.

Also read :అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading