Home » తమిళ స్టార్ హీరో కి జోడిగా ఐశ్వర్య.. 22 ఏళ్ల తర్వాత..!

తమిళ స్టార్ హీరో కి జోడిగా ఐశ్వర్య.. 22 ఏళ్ల తర్వాత..!

by Anji
Ad

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా “తునివు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాజా రాణి ఫేమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించనున్నరు.  ఈ చిత్రానికి ఏకే 67 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ త్రిష కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. పొన్నియన్ సెల్వన్ తో సౌత్ లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంతో అజిత్ సరసన కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

Advertisement

మరోవైపు ఈ సినిమాలో అజిత్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరూ కథానాయికలకు ప్రాధాన్యత ఉండడంతో త్రిష, ఐశ్వర్యరాయ్ నటించనున్నట్టు సమాచారం. ఇటీవల వీరిద్దరూ హీరోయిన్లు “పొన్నియిన్ సెల్వన్” చిత్రంలో కలిసి నటించిన విషయం విధితమే. అజిత్ చిత్రంలో వీరిద్దరికీ ఈక్వల్ రోల్ ఉంటున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. అరవింద్ స్వామి మెయిన్ విలన్ నటించనున్నాడు. ఇటీవల కాలంలో ఆయన వరుస సినిమాలను చేస్తుండగా.. అజిత్ తో కాంబినేషన్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అజిత్, అరవింద్ స్వామి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మొదటిసారి. 

Advertisement

Also Read :   “శాకుంతలం” నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన సమంత..!

Manam Newsఈ సినిమా ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. అరవింద్ స్వామి మెయిన్ విలన్ నటించనున్నాడు. ఇటీవల కాలంలో ఆయన వరుస సినిమాలను చేస్తుండగా.. అజిత్ తో కాంబినేషన్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అజిత్, అరవింద్ స్వామి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మొదటిసారి. మరోవైపు కామెడీ థ్రిల్లర్ కథాంశం కావడంతో కోలీవుడ్ టాప్ కమెడీయన్ గా కొనసాగుతున్న సంతానంతో పాటు ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి టాలెంటేడ్ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తున్నటువంటి లైకా ప్రొడక్షన్ ‘Ak 62’ ని నిర్మించబోతుంది. ఈ సంస్థకి అజిత్ తో తొలి సినిమా కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ బ్యానర్ ఇటీవల కాలంలో పొన్నియిన్ సెల్వన్ ప్రాంఛైజీ మూవీస్ తో పాటు కమల్ హాసన్ అప్ కమింగ్ మెగా బడ్జెట్ మూవీ ఇండియన్ 2, సూపర్ స్టార్ రజినీకాంత్  మూవీతో  పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 

Also Read :  హైపర్ ఆదికి జారు మిఠాయి తినిపిస్తా అంటూ శ్రీరెడ్డి ఫైర్…వీడియో వైరల్….!

Visitors Are Also Reading