మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మానవ శరీరం కొన్ని పోషకాలను స్వయంగా ఉత్పత్తిచేసుకోలేదు. అందువలన మంచి ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరానికి కావాల్సిన సంపూర్ణమైన పోషకాలు అందించే ఆహారాలలో పాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకప్పుడంటే పశుసంపద అందరికీ అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
Advertisement
గత కొన్ని సంవత్సరాలుగా మనకు అనేక రకాల పాలు ప్యాకెట్లు మార్కెట్లో లభిస్తున్నాయి. మార్కెట్లో లభిస్తున్న ఈ పాల ప్యాకెట్లు టోన్డ్ మిల్క్, ఫుల్ క్రీమ్, క్రీమ్‌లెస్ ఇలా చాలా రకాల పాలు అందుబాటులో వచ్చేసాయి. ఇందులో ఒక్కో రకం పాలు ఒక్కోక్కరికి ఒక్కోవిధంగా ఉపయోగపడతాయి. మరీ వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి బట్టి అనేకమంది ఊబకాయ సమస్యతో సతమతమవుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా కొవ్వు ఉన్న పదార్ధాలను తినడం తగ్గించాలని తమ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి ఎక్కువగా చెబుతూనే ఉంటారు. ఎక్కువగా కొవ్వు ఉన్నా పాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తూ ఉంటారు. కాబట్టి స్కిమ్డ్ లేదా హోల్ మిల్క్ ఆరోగ్యానికి నిజంగా హాని చేస్తుందా అనే సందేహం అందరిలోని నెలకొంది. కానీ స్కిమ్డ్ మిల్క్‌తో పోలిస్తే మీగడ ఉన్న పాలే ఆరోగ్యానికి మంచివని అధ్యయనాలు రుజువు చేశాయి.
స్కిమ్డ్ మిల్క్ :
Advertisement
పాలలోని కొవ్వు తీసేసి ఆ పాలనే స్కిమ్డ్ మిల్క్ లేదా ఫ్యాట్ లెస్ మిల్క్ అని అంటారు. అధిక బరువు ఉన్నవారు ఈ పాలను తాగడం వల్ల వారికి కావలసిన పోషకాలు అందడంతో పాటు బరువు కూడా తగ్గుతారని కొన్ని అధ్యయనాలలో రుజువయ్యింది
ఫుల్ క్రీమ్ మిల్క్ :
పాల నుంచి కొవ్వుని వేరు చేయని పాలనే ఫుల్ క్రీమ్ మిల్కీ అని అంటారు. ఈ పాలల్లో శరీరానికి ఉపయోగ పడే కాల్షియం, విటమిన్ ఎ,డి, బి1, పాస్ఫరస్, రైబోఫ్లేవిన్, సమృద్ధిగా లభిస్తాయి. ఫుల్ క్రీమ్ మిల్క్ లో 3.5శాతం కొవ్వు ఉంటుంది. కాబట్టి ఈ పాలు చిన్నపిల్లలు, గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలు మెదడుకి కావలసిన పోషణ కూడా అందిస్తాయి. అందుకనే వైద్య నిపుణులు ఎదిగే పిల్లలకి కొవ్వు ఎక్కువగా ఉండే పాలను తాగించమని సిఫార్సు చేస్తారు.
ఆర్గానిక్ పాలు :
ఆవులు మరియు గేదెల దగ్గర నుంచి లభించే పాలని ఆర్గానిక్ లేదా సేంద్రియ పాలు అని అంటారు. వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి . అయితే ఓ వయసు వచ్చాక చాలా మందికి సేంద్రియ పాలు జీర్ణం కావు. అలాగే కొంతమందిలో శరీరతత్వం వల్ల కూడా ఆవు లేదా గేదె పాలు వారికి పడకపోవచ్చు. అలాంటివారు ఈ పాలకు దూరంగా ఉండటమే ఉత్తమం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Health tips :ఈ వాటర్ ను పొరపాటున కూడా పారబోయకండి.. అమృతంతో సమానం.. ఎందుకంటే?
Health Tips: ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Health tips :ఈ వాటర్ ను పొరపాటున కూడా పారబోయకండి.. అమృతంతో సమానం.. ఎందుకంటే?